Begin typing your search above and press return to search.
మోడీ చేసిన ఈ కామెంట్లు ఏపీ గురించేనా?
By: Tupaki Desk | 10 March 2018 8:27 PM ISTడిల్లీ వేదికగా జాతీయ ప్రజాపతినిధుల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ప్రయోజనాల కోసం రాష్ట్రం తరఫున అన్ని పార్టీలు గళం విప్పుతున్న సమయంలో ప్రధాని మోడీ ఆయా రాష్ర్టాల గురించి చేసిన కామెంట్లు ఆసక్తిని కలిగించాయి. ఠక్కున ఏపీ గుర్తుకు వచ్చేలా ప్రధాని మోడీ చేసిన కామెంట్లు ఉండటం గమనార్హం. సామాజిక అభివృద్ధి అంటే, దేశంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా చూస్తూ సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడమే తప్ప, ఏదో ఒక్క ప్రాంతాన్ని పట్టుకుని వెళ్లడం కాదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మాదిరిగానే దేశాల మధ్య కూడా పోటీ ఉంటుందని.. ఆ పోటీతత్వం వల్లే రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు
రాష్ర్టాల మధ్య పోటీని విద్యార్థుల చదువుతో ప్రధాని మోడీ పోల్చారు. `సాధారణంగా ఒక విద్యార్థి ఒక విషయంలో బాగా రాణించినా మరో విషయంలో వెనుకబడిపోవచ్చు. అలాగే రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు కూడా ఒకేలా ఉండవు. కొన్ని అభివృద్ధి చెంది ఉంటాయి. మరికొన్ని వెనుకబడిపోయి ఉంటాయి. వెనుకబడిన జిల్లాలు తమ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. దేశంలో అభివృద్ధి చెందిన జిల్లాతో పోలిస్తే మనం ఎక్కడున్నామో గమనించాలి. తదనుగుణంగా ప్రణాళిక రచించుకోవాలి.` అంటూ అభివృద్ధి అంటే ఆయా రాష్ర్టాలు మాత్రమే చేసుకోవాల్సిన చర్యగా వివరించారు. సామాజిక న్యాయంపై మనమంతా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.