Begin typing your search above and press return to search.

ఇజ్రాయిల్ లో మోడీ బ‌స చాలా స్పెష‌ల్‌

By:  Tupaki Desk   |   5 July 2017 4:06 PM IST
ఇజ్రాయిల్ లో మోడీ బ‌స చాలా స్పెష‌ల్‌
X
ప్ర‌పంచంలో భార‌త‌దేశ ప్ర‌ధాని అంటేనే ఒక మ‌ర్యాద‌.. గౌర‌వం. ఆ సీట్లో మోడీ కూర్చున్న నాటి నుంచి దాని ఇమేజ్ అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. ఒక్కో విదేశీ ప‌ర్య‌ట‌న ముగుస్తున్న కొద్దీ మోడీ ఇమేజ్ అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. ట్రంప్ లాంటి మొండి అధ్య‌క్షుడు సైతం మోడీని ఆకాశానికి ఎత్తేయ‌టం అంటే న‌మో మేజిక్ ఎంత‌న్న‌ది చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత‌వ‌ర‌కూ భార‌త‌దేశ ప్ర‌ధాని ఇజ్రాయిల్‌ లో ప‌ర్య‌టించ‌లేదు. తొలిసారి మోడీ ఆ దేశంలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో.. మోడీ కోసం ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను చేసింది ఇజ్రాయిల్‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ దేశంలో ప‌ర్య‌టించిన పోప్‌ కు.. అమెరికా అధ్య‌క్షుడి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అలాంటి ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. ఇజ్రాయిల్ లో మోడీ అడుగు పెట్టిన వేళ‌.. ఆయ‌న‌కు గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు ఏకంగా ఆ దేశాధ్య‌క్షుడే స్వ‌యంగా ఎయిర్ పోర్ట్‌ కు వ‌చ్చి సాద‌రంగా స్వాగ‌తం ప‌ల‌క‌టం తెలిసిందే.

ఇక‌.. ఇజ్రాయిల్ లో మూడు రోజుల పాటు ఉండే మోడీ కోసం ఆ దేశం భారీగానే ఏర్పాట్లు చేసింది. మోడీ బ‌స కోసం ప్ర‌పంచంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన హోట‌ల్ సూట్‌ ను ఏర్పాటు చేసింది. జెరూస‌లెంలోని కింగ్ డేవిడ్ హోట‌ల్ లో మోడీ కోసం బ‌స ఏర్పాటు చేశారు. ఆయ‌న ఉండే సూట్ స్పెషాలిటీస్ వింటే అవాక్కు అవ్వాల్సిందే.

బాంబు దాడులు.. ర‌సాయ‌నిక దాడుల‌తో స‌హా ఎలాంటి దాడి జ‌రిగినా మోడీ బ‌స చేసిన సూట్‌కు మాత్రం చెక్కుచెద‌ర‌ద‌ని చెబుతున్నారు. మోడీ అండ్ కో కోసం ఆ హోట‌ల్లో 110 రూముల్ని కేటాయించారు. ఇక‌.. ఆ హోట‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. మాజీ అధ్య‌క్షుడు క్లింట‌న్‌.. బుష్‌.. ఒబామాల‌కు మాత్ర‌మే కేటాయించిన సూట్ ల‌ను మోడీ కోసం కేటాయించ‌టం విశేషం.

ఇక‌.. మోడీకి ఇష్ట‌మైన ఆహారాన్ని త‌యారు చేసేందుకు వీలుగా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. మోడీ అమితంగా ఇష్ట‌ప‌డే గుజ‌రాతీ వంట‌కాల‌తో ప్ర‌త్యేక విందు ఏర్పాట్లు చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న తినే కుకీస్‌లో కోడిగుడ్డు.. పంచ‌దార లేకుండా ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

మోడీకి కేటాయించిన సూట్‌ కి అనుబంధంగా కిచెన్ ఏర్పాట్లు ఉన్నాయ‌ని.. ఆయ‌న ఎప్పుడు ఏం తినాల‌నిపిస్తే అందుకు త‌గ్గ‌ట్లుగా వంట చేసి ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు జ‌రిగాయ‌ని చెబుతున్నారు. ఇక‌..మోడీ ఉండే ప్రాంతాన్ని పువ్వుల‌తో అందంగా అలంక‌రించ‌టంతో పాటు.. ప్ర‌త్యేకంగా ఉండేలా చూస్తున్నారు. మొత్తానికి ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న‌లో మోడీని సో.. సో.. స్పెష‌ల్ గా ట్రీట్ చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.