Begin typing your search above and press return to search.

ఇది శాంపిల్ మాత్ర‌మే - అస‌లు క‌థ ముందుంది: మోడీ

By:  Tupaki Desk   |   13 Feb 2020 3:45 PM IST
ఇది శాంపిల్ మాత్ర‌మే - అస‌లు క‌థ ముందుంది: మోడీ
X
ఒక‌వైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ గ్రాఫ్ త‌గ్గిన వైనం స్ప‌ష్టంగా గోచ‌రిస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల్లో త‌నే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అన్న‌ట్టుగా మోడీ ప్ర‌చారం చేయ‌గా.. ఆయా చోట్ల భార‌తీయ జ‌న‌తా పార్టీ చిత్తు అవుతూ ఉంది. మోడీనే స్వ‌యంగా బాధ్య‌త‌లు తీసుకున్నా బీజేపీ నెగ్గుకురాలేక‌పోవ‌డం ఆయ‌న గ్రాఫ్ డౌన్ అయ్యింద‌నేందుకు ఒక నిద‌ర్శ‌నం అని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మోడీ భ‌క్తుల‌ను కాస్త ఢీలా ప‌రిచాయి.

అయితే మోడీ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఢిల్లీలో జ‌రుగుతున్న ఒక స‌ద‌స్సులో మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యాల గురించి మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కూ తాము తీసుకున్న నిర్ణ‌యాలు శాంపిల్స్ మాత్ర‌మే అని మోడీ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇంకా మొద‌లు మాత్ర‌మే అని - ముందు ముందు మ‌రింత అస‌లు క‌థ ఉంటుంద‌ని అంటూ మోడీ వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి త‌మ ద‌గ్గ‌ర ప్లాన్ ఉందంటూ ఆయ‌న చెప్పుకురావ‌డం గ‌మ‌నార్హం.

రెండోసారి గ‌ద్దెనెక్కాకా మోడీ ప్ర‌భుత్వం ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ఎన్నాళ్లుగానో త‌మ డిమాండ్ అయిన ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును చేసింది బీజేపీ ప్ర‌భుత్వం. అలాగే ముస్లింలలో ఉన్న ట్రిపుల్ త‌లాక్ సంప్ర‌దాయాన్ని చ‌ట్ట‌బ‌ద్ధంగా ర‌ద్దు చేసింది - ఆ పై ఎన్సీఆర్సీ-సీఏఏ అంటూ ప్ర‌కంప‌న‌లు రేపింది. ఆ ర‌చ్చ ఇంకా చ‌ల్లార‌లేదు. అయితే ఇంతలోనే మోడీ మాట్లాడుతూ ఇదంతా శాంపిల్ మాత్ర‌మే అని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే మోడీ తీసుకున్న వివిధ నిర్ణ‌యాలు కొన్ని విక‌టించాయి కూడా.

నోట్ల ర‌ద్దు - జీఎస్టీ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీశాయి. నోట్ల ర‌ద్దు త‌ర్వాత దెబ్బతిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్ప‌టికీ కోలుకోలేద‌నే అభిప్రాయాలున్నాయి. అయితే జాతీయ వాదం - హిందుత్వ నినాదాల‌తో బీజేపీ బండి నెట్టుకు వ‌స్తోంది. అవే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని న‌మ్ముతూ ఉంది క‌మ‌లం పార్టీ. వాటిని అడ్డుపెట్టుకుని వివిధ నిర్ణ‌యాల‌ను అమ‌లు చేస్తూ ఉన్నారు. ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. ఇప్పుడు మోడీని అడ్డుకోగ‌లిగిన వారు మాత్రం లేదు. అయితే ఎటొచ్చీ దేశాన్ని అస్థిర ప‌రిచే - వ్య‌వ‌స్థ‌ను విక‌టించే నిర్ణ‌యాలు మాత్రం భ‌యాందోళ‌న‌లు రేపేవే.

కానీ ముందుంది అస‌లు క‌థ అన్న‌ట్టుగా మోడీ ఒకింత వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా మాట్లాడారు. దీంతో ఆయ‌న ఇంకా ఏ నిర్ణ‌యాలు తీసుకుంటారో - ఏం ప్ర‌యోగాలు చేస్తారో అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారుతూ ఉంది.