Begin typing your search above and press return to search.
వారి ట్వీట్లకు మోడీ రియాక్ట్ అయ్యారు
By: Tupaki Desk | 9 Sept 2019 10:24 AM ISTప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. చంద్రయాన్ 2 ప్రయోగానికి సంబంధించి.. చివర్లో చోటు చేసుకున్న ఊహించని పరిణామం నేపథ్యంలో ప్రధాని మోడీ ఇస్రోకు బాసటగా నిలిచారు. మోడీనే కాదు.. దేశ ప్రజలంతా ఇస్రోకు నైతిక మద్దతు ప్రకటించి.. శాస్త్త్రవేత్తలకు సరికొత్త స్ఫూర్తిని ఇచ్చారు. చంద్రయాన్ ప్రయోగం చివర్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు.
ఇస్రో శాస్త్రవేత్తల కష్టంపై బాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తూ.. మీ వెంట మేమున్నామంటూ ట్వీట్లు చేశారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా చేసిన వారిలో ప్రముఖ సినీ నటీమణులు అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ లతో పాటు.. అగ్ర దర్శకుల్లో ఒకరైన మధుర్ బండార్కర్ తో పాటు పలువురు రియాక్ట్ అయ్యారు. వారు చేసిన ట్వీట్లలో అనుష్క.. సోనమ్.. మధుర్ ట్వీట్లకు ప్రధాని మోడీ స్పందించారు.
వారి ట్వీట్లకు రిప్లై ఇస్తూ.. ఒక కటుంబంలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవటాన్ని అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తల పట్ల భారత పౌరులు గర్వపడుతున్నారన్నారు. సినీ ప్రముఖుల ట్వీట్లకు ప్రధాని మోడీ బదులివ్వటాన్ని చూస్తే.. ప్రతి విషయాన్ని తాను గమనిస్తుంటానన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి. ఏమైనా.. దేశ ప్రధాని సినీ ప్రముఖుల ట్వీట్లకు రియాక్ట్ కావటం ప్రధాని మోడీకే సాధ్యమవుతుందేమో?