Begin typing your search above and press return to search.
పైసా రాల్చకుండా సారుకు మరోసారి షాకిచ్చిన మోడీ
By: Tupaki Desk | 3 Aug 2019 10:00 AM ISTఇద్దరు తెలివైనోళ్ల మధ్య పవర్ గేమ్ మొదలైతే ఎలా ఉంటుంది? తాజాగా ప్రధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య వైరం ఇదే తీరులో నడుస్తోంది. కేసీఆర్ దూకుడుకు కళ్లాలు వేయాలన్నది మోడీ ఆలోచన అయితే.. ప్రధాని మనసు దోచుకోవటం ద్వారా తమ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు తెచ్చుకోవాలన్నది కేసీఆర్ ఆశ. అయితే.. తెలంగాణ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ఎప్పటిలానే మోడీ.. మొండిచేయి చూపించారు.
కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం.. మిషన్ భగీరధ.. మిషన్ కాకతీయ పథకాలకు పైసా రాల్చని కేంద్రం తీరుతో కేసీఆర్ కు షాక్ మీద షాకులు తగులుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలంటూ నీతి అయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం నుంచి నయా పైసా రాకపోవటం గమనార్హం. మిషన్ భగీరథ పథకం బాగుందంటూ నీతి అయోగ్ ప్రశంసలేకాదు.. ఈ పథకానికి రూ.19వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అంతేకాదు.. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్న మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని రికమండ్ చేసింది. అయితే.. ఈ సూచనను కేంద్రం లైట్ తీసుకోవటం గమనార్హం.
నీతి అయోగ్ సిఫార్సుల విషయంలో కేంద్రం నెగిటివ్ గా రియాక్ట్ కావటమే కాదు.. ఎలాంటి నిధులు విడుదల చేయకపోవటంతో ప్రత్యామ్నాయ పద్దతులతో నిధుల్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికిప్పుడు పలు ప్రాజెక్టులకు సంబంధించి రూ.70వేల కోట్ల వరకు అవసరం. ఇందులో కేంద్రం అంతో ఇంతో నిధులు ఇచ్చి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా వ్యవహరించటంతో ఈ భారీ మొత్తాన్ని కేసీఆర్ సర్కారే సమకూర్చుకోవాల్సిన దుస్థితి.
ఎన్నిసార్లు కేంద్రాన్ని అడిగినా ఎలాంటి ప్రయోజనం ఉండని నేపథ్యంలో విసిగిపోయిన కేసీఆర్ సర్కారు చివరకు విలువైన భూముల్ని అమ్మకాలకు పెట్టే ప్రయత్నానికి తెర తీసింది. ఇటీవల కాలంలో భూముల ధరలు భారీగా పెరగటం ద్వారా.. భూముల విక్రయాలతో పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా భూముల అమ్మకాల ద్వారా కనీసం రూ.10 వేల కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. హెచ్ ఎండీఏ పరిధిలో ఉన్న 140 ఎకరాలు.. రాయదుర్గంలోని టీఎస్ ఐఐసీకి ఉన్న 180 ఎకరాల్ని అమ్మటం ద్వారా రూ.10వేల కోట్లను సమకూర్చుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. మొత్తానికి పైసా విదల్చని మోడీ సర్కారు పుణ్యమా అని.. ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం కేసీఆర్ సర్కారు భూములు అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారన్న మాట వినిపిస్తోంది. మోడీ తీరుతో కేసీఆర్ మస్తు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.