Begin typing your search above and press return to search.

మోడీ మైండ్ లో ఉన్న మరిన్ని ఆలోచనలు!

By:  Tupaki Desk   |   22 Nov 2016 9:28 AM IST
మోడీ మైండ్ లో ఉన్న మరిన్ని ఆలోచనలు!
X
పెద్దనోట్ల రద్దు ప్రకటనతో యావత్ దేశంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోట్ల రద్దు నిర్ణయం అన్నది ప్రారంభం మాత్రమేనని.. ప్రధాని మనసులో ఇలాంటి ఆలోచనలుచాలానే ఉన్నాయని.. త్వరలో వాటన్నింటినీ అమలు చేస్తారని.. నల్లధనాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయటంతో పాటు..అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించటం.. ప్రతి లావాదేవీపైనా బ్యాంకుల ముద్ర ఉండేలా చూడటం.. ప్రతి రూపాయిని ఖర్చు చేసేందుకు అధికారికంగా మార్చటంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారంగా ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించిన ప్రత్యేక కథనంలో ఆసక్తికర అంశాలు బోలెడన్ని ఉన్నాయి.

ఈ అంశాల్లో కొన్నింటిని అమలు చేసినా.. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రావటంతో పాటు.. బ్లాక్ మనీ అన్నది దరి చేరకుండా ఉండటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకూ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే మొత్తానికి.. విత్ డ్రా చేసే మొత్తానికి ఎలాంటి పరిమితులు లేవు. అదే సమయంలో చేతిలో పెద్ద ఎత్తున నగదు ఉంచుకున్నా ఏమీ కాని పరిస్థితి. కానీ.. అందుకు భిన్నంగా వీలైనంతవరకూ ఆర్థిక లావాదేవీలన్నీ అధికారికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది మోడీ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో అమలు చేయాలని భావిస్తున్న సంచలన నిర్ణయాల్ని చూస్తే..

= పెద్ద నోట్ల రద్దు ముందు వరకూ ఎంత మొత్తాన్నిఅయినా బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం.. ఎంత మొత్తమైనా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. దాన్ని పూర్తిగా మార్చాలన్నది మోడీ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. వచ్చే ఏడాది మొదటి నుంచి.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసే మొత్తం మీదా.. విత్ డ్రా చేసే మొత్తం మీద పరిమితులు విధించాలన్నది తాజా నిర్ణయంగా చెబుతున్నారు.

= దీని ప్రకారం సేవింగ్స్ అకౌంట్లో రోజుకు రూ.50వేలు.. కరెంటు అకౌంట్లో రూ.లక్ష రూపాయిల కంటే విత్ డ్రా చేసే అవకాశం లేకుండా చేయాలన్నది మోడీ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. విత్ డ్రా కంటే కూడా.. మనీ ట్రాన్స్ ఫర్లు.. చెక్కులు.. డీడీలను.. ప్లాస్టిక్ మనీని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

= బ్యాంకుల్లో చేసే నగదు విత్ డ్రా మీద పన్ను విధించే ఆలోచన కూడా మోడీ సర్కారుకు ఉన్నట్లుగా తెలుస్తోంది.

= అంతేకాదు.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా వ్యక్తిగతంగా నగదునుఉంచుకునే తీరుపై కూడా పరిమితులు విధించనున్నట్లుగా తెలుస్తోంది. తమ దగ్గర ఉన్న నగదును బ్యాంకుల్లో వేయకుండా తమ దగ్గర ఉంచుకునే మొత్తాన్ని రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకూ పరిమితం చేయాలని భావిస్తున్నారు. అంటే.. ఎలాంటి లావాదేవీలు జరగాలన్నా అధికారికంగా బ్యాంకింగ్ ద్వారానే జరగాలన్నది మోడీ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/