Begin typing your search above and press return to search.
మోడీ చేతుల మీదుగా మెట్రో జాతికి అంకితం
By: Tupaki Desk | 28 Nov 2017 3:15 PM ISTఅనుకున్న సమయం రానే వచ్చింది. ఎప్పుడా.. మరెప్పుడా అంటూ ఎదురుచూసిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమైంది. షెడ్యూల్ సమయానికి మూడు నిమిషాల ఆలస్యంగా మెట్రో ఫైలాన్ ను ప్రధాని మోడీ ఆరంభించారు. అనంతరం లిఫ్ట్ లో మియాపూర్ స్టేషన్ లోపలకు చేరుకున్న ప్రధాని.. మియాపూర్ స్టేషన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అక్కడ మెట్రో అధికారులు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను వీక్షించారు.
అక్కడే టీ సవారి మొబైల్ యాప్ ను రిలీజ్ చేశారు. అనంతరం మెట్రో కోచ్ లోకి వెళ్లారు ప్రధాని మోడీ. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్.. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్.. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఒక వైపు కూర్చుంటే.. కిషన్ రెడ్డి.. మరికొందరు నేతలు.. అధికారులు మరోవైపు కూర్చున్నారు.
మియాపూర్ నుంచి కుకట్‌పల్లికి కేవలం 5 నిమిషాల్లో చేరుకున్నారు. మియాపూర్ తర్వాత జేఎన్ టీయూ.. కేపీహెచ్ బీ.. కుకట్ పల్లి స్టేషన్లను కేవలం ఐదు నిమిషాల్లోనే వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ ప్రారంభమైన మెట్రో ప్రయాణం కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో మళ్లీ మియాపూర్ కు చేరుకున్నారు. అనుకున్నట్లే సరిగ్గా 2.40 గంటలకు మియాపూర్ స్టేషన్ కు మెట్రో చేరుకుంది. కొద్ది సెకన్ల తేడాతో మెట్రో రైల్ నుంచి స్టేషన్ లోకి వచ్చారు.
మోడీ మెట్రో ప్రయాణంలో ఒకవైపు మంత్రి కేటీఆర్ కూర్చుంటే.. మరోవైపు గవర్నర్ నరసింహన్ కూర్చున్నారు. గవర్నర్ కు పక్కన సీఎం కేసీఆర్ కూర్చున్నారు. పది నిమిషాల మెట్రో రైల్ ప్రయాణంలో ప్రధాని.. ముఖ్యమంత్రి మాట్లాడుకున్నది ఏమీ లేదు. కొంతలో కొంత మంత్రి కేటీఆర్ చొరవగా ప్రధాని మోడీతో మాట్లాడటం కనిపించింది. మొదట మోడీతో మాటలు కలిపింది మంత్రి కేటీఆరేనని చెప్పాలి. తర్వాత కొన్నిసార్లు మంత్రి కేటీఆర్ ను ఏదో అడగటం కనిపించింది.
ప్రయాణం మధ్యలో భవనాల మీద తనకు అభివాదం చెబుతున్న ప్రజలకు మోడీ అభివాదం చేశారు. ఈ దృశ్యాల్ని సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లు మౌనంగా చూస్తుండిపోయారు.