Begin typing your search above and press return to search.

కారు కేసీఆర్‌ దే - స్టీరింగ్ మాత్రం ఒవైసీ - మోదీ

By:  Tupaki Desk   |   1 April 2019 10:05 PM IST
కారు కేసీఆర్‌ దే - స్టీరింగ్ మాత్రం ఒవైసీ - మోదీ
X
ప్రతిపక్ష పార్టీలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడంలో మోదీని మించినవారు లేరు. ఇంకా చెప్పాలంటే మోదీ వచ్చిన తర్వాతే భారతీయ జనతా పార్టీకి స్టార్‌ డమ్‌ వచ్చింది. దూకుడుగా ఉండడం - తమ మాట వినని వారిపై ఐటీ - ఈడీ - సీబీఐ అంటూ బెదిరించడం మోదీకే చెల్లింది. తమని విమర్శించిన వారి ఆయువుపట్టు మీద కొట్టడంలో మోదీ సిద్ధహస్తుడు. ఇప్పటికే చంద్రబాబుని ఓ ఆటాడుకుంటున్న మోదీ దృష్టి ఇప్పుడు కేసీఆర్‌ పై పడింది. ఇన్నాళ్లూ సైలెంట్‌ గా ఉన్న మోదీ.. ఎల్బీ స్టేడియంలో తన విశ్వరూపం చూపించాడు. బీజేపీ హిందూత్వంపై దాడి చేసిన కేసీఆర్‌ పై.. అదే స్థాయిలో కౌంటర్లు వదిలారు మోదీ.

“‘కారు టీఆర్ ఎస్ దే అయినా - స్టీరింగ్ మాత్రం మజ్లిస్ పార్టీ చేతిలో ఉంది. ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్లు వీరు వీళ్లు వారు అవుతారు అనే సామెత ఉంటుంది. ఆ సామెత ప్రకారం మజ్లిస్ పార్టీతో సావాసం కారణంగా టీఆర్ ఎస్ కూడా ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొస్తామంటే మజ్లిస్ అడ్డుకుంది. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి భాష అర్థం కాదు. తెలంగాణ అభివృద్ధికి మజ్లిస్ పార్టీ స్పీడ్ బ్రేకర్. కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు” అని కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు మోదీ

ఇక ఏపీ సీఎం చంద్రబాబుని కూడా వదల్లేదు నరేంద్ర మోదీ. తనదైన స్టైల్లో కౌంటర్స్‌ వదలారు. “దేశానికి ఇద్దరు ప్రధానులు ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ కోరుతోంది. అలాంటి వారితో చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు. దీన్నిబట్టి భారతదేశానికి ఎవరు ప్రధానికి ఉండాలో మీరే అర్థం చేసుకోవాలి. ఎవరు దేశభక్తులో ఎవరు పాకిస్థాన్ ఏజెంట్ లో ప్రజలు గమనించాలి. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలంటున్న ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ఏపీలోని యు-టర్న్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాంబులతో దద్దరిల్లే దేశం కావాలా? ప్రశాంతంగా ఉన్న ఇప్పటి తరహా భారత్ కావాలా?” అంటూ చంద్రబాబుపై విమర్శల స్ట్రైక్స్‌ చేశారు మోదీ.