Begin typing your search above and press return to search.
అన్నేళ్లు పాలించి ఏం చేశారు కేసీఆర్-మోడీ
By: Tupaki Desk | 27 Nov 2018 5:24 PM ISTతప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అని మన మహాకవి వేమన ఏనాడో చెప్పారు. నరేంద్రమోడీ నిజామాబాద్ ప్రసంగం వింటే ఇదే పద్యం గుర్తు వస్తోంది. మాటలు కోటలు దాటించి పనులు గడప దాటని పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ గడ్డమీద వచ్చి కేసీఆర్ ఏం చేశారు అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి పైసా లెక్క చెప్పాల్సిన అసవరం ఉందన్నారు. ఇదంతా బానే ఉంది గాని... ప్రధానిగా ఆయనకు కూడా ప్రజల నుంచి ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఆ విషయం మాత్రం ఆయన చాలా పద్ధతిగా మరిచిపోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ ను లెక్కచెప్పాలని అడుగుతున్న మోడీ... సుప్రీంకోర్టు రాఫెల్ లెక్కలు చెప్పమని అడుగుతుంటే అదంతా రహస్యం - ఇవ్వను అంటున్నారు.
ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే... ఎన్నో పోరాటాలు - ఉద్యమాలు చేసి ఎందరో ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని - అలాంటి తెలంగాణను నాలుగున్నర్ర ఏళ్లు పాలించిన టీఆర్ ఎస్ సర్కార్ తెలంగాణకు ఏమి చేసిందని మోడీ ప్రశ్నించారు. అయితే ముందుగా ఆ ఉద్యమం నడిపిందెవరో - చేసిందెవరో - ముందుకు తీసుకెళ్లిందెవరో అన్న వివరణాత్మక చరిత్రను మాత్రం మోడీ మరిచిపోయారు.
కేసీఆర్ పై మోడీ పలు ఇతర విమర్శలు కూడా చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ తరహాలోనే అభివృద్ధి లేకుండా ఎన్నికలు గెలవాలని చూస్తోందన్నారు. నిజామాబాద్ ను లండన్ గా మారుస్తామన్నారని... వచ్చేటపుడు హెలికాప్టర్ లో చూశాను లండన్ కనపడుతుందేమో అని కానీ కనపడ లేదని వ్యంగ వ్యాఖ్యలు చేశారు మోడీ. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇపుడు ముఖ్యమంత్రి - ఆయనది కాంగ్రెస్ రక్తమే అన్నారు.
ఈ సందర్భంగా గాంధీ కుటుంబంపైనా ధ్వజమెత్తారు. ఇటీవలే ఓ బహిరంగ సభలో సోనియాగాంధీ - రాహుల్ గాంధీలు తెలంగాణలో కుటుంబ పాలనపై గురించి మాట్లాడారని... అసలు వారికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. అసలు కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రెస్ కాంగ్రెస్ అన్నారు.