Begin typing your search above and press return to search.

మోడీ యూపీ ప్రచారం హైదరాబాద్ లో షురూ?

By:  Tupaki Desk   |   8 Aug 2016 11:39 AM IST
మోడీ యూపీ ప్రచారం హైదరాబాద్ లో షురూ?
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించటమే కాదు.. బీజేపీకి ప్రతిష్ఠాత్మకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. మిగిలిన నేతలకు భిన్నంగా ఆయన.. యూపీతో ఏమాత్రం సంబంధం లేని వేదిక మీద ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారని చెప్పాలి. హైదరాబాద్ లో బీజేపీ మహా సమ్మేళన్ లో పాల్గొన్న ఆయన.. దళితుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో దళితుల మీద జరిగిన దాడుల్ని బూచీగా చూపిస్తూ.. తన రాజకీయ ప్రత్యర్థులు మొదలుపెట్టిన పొలిటికల్ గేమ్ కు చెక్ పెట్టేందుకు మోడీ తన గేమ్ షురూ చేసిన వైనం హైదరాబాద్ లో ఆయన చేసిన ప్రసంగం చెప్పకనే చెప్పిందని చెప్పాలి.

దళితుల మీద జరగుతున్న దాడులు.. వాటికి మీడియాలో లభిస్తున్న ప్రాధాన్యత.. దాని ప్రభావం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉంటుందన్న విషయం ప్రధాని మోడీకి తెలియంది కాదు. అందుకే.. ఎప్పుడూ లేని విధంగా దళితుల విషయాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించిన మోడీ.. అవసరమైతే తనను కొట్టాలి కానీ దళితుల్ని కాదని.. కావాలంటే తనను చంపాలి కానీ దళితుల్నికాదంటూ తీవ్రభావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉన్నట్లుండి దళితుల అంశంపై మోడీ ఎందుకంట భారీ వ్యాఖ్యలు చేశారు? దేశంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనిప్పుడు గళం విప్పారంటే దానికి కారణం లేకపోలేదు.

యూపీ ఎన్నికల్లో కీలకమైన దళిత ఓటు బ్యాంకు చేజిక్కించుకోవటంతో పాటు.. వారి మనసుల్లో తన ముద్ర వేయాలన్న ఉద్దేశమే మోడీ చేత ఇలాంటి మాటలు మాట్లాడించిందని చెప్పాలి. దేశంలో ఎక్కడో ఒకచోట జరిగిన దళితుల మీద దాడిని బూచిగా చూపిస్తూ రాజకీయ ప్రత్యర్థులు తమ సర్కారు ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రచారంచేసిన క్రమంలో అందుకు చెక్ చెప్పేందుకు వీలుగా మోడీ దళితులకు దన్నుగా మాట్లాడినట్లు చెప్పాలి.

దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి భూమాత సిగ్గుతో తలవంచుకుంటోందని చెప్పిన ఆయన.. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా.. దోషాలు పోకపోగా.. వికృత రూపాలు ఇంకా సంతరించుకుంటున్నాయని.. కొన్ని ఘటనలు మానవతకు మాయని మచ్చగా మారాయని మోడీ వ్యాఖ్యానించటం గమనార్హం. ఇప్పటికీ అంటరాని తనం.. అస్పృశ్యతలమీద దళితులను కొందరు సమాజానికి దూరం చేస్తున్నారని.. కొందరు దళిత సోదరులపై కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. ‘‘ఇలాంటి వారు.. ఏదైనా సమస్యలు ఉంటే నాపై పోరాటం చేయాలి. దళితులపై కాదు. తుపాకీతో కాల్చాలనుకుంటే.. ముందుగా నన్ను కాల్చండి. ఓట్లతో కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. దళిత సమాజం వారి కబ్జాలో ఉంది. దళితుల అభివృద్ధి కోసం బీజేపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు.. మంచిపనులు వారికి చేకూడదని పన్నాగం ప్నుతాయి. దళిత వర్గాలు బీజేపీ వైపు వెళితే.. మరో 50 ఏళ్లు బీజేపీ ను అధికారం నుంచి పక్కకు జరపలేమని తెలుసు. అందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. దేశమాత కోసం బలిదానమిచ్చిన వారిలో దళితులు ముందున్నారు’’ అంటూ దళితుల మీద భారీగా తనకున్న కమిట్ మెంట్ ను నరేంద్ర మోడీ ప్రదర్శించే ప్రయత్నం చేయటం గమనార్హం.

దళితుల విషయంలో తమ సర్కారు ఎలా వ్యవహరిస్తుందన్న విషయాన్ని భావోద్వేగంతో చెప్పిన ఆయన.. తన వాదనకు దన్నుగా అంబేడ్కర్ కు తమ సర్కారు ఎంత పెద్ద పీట వేసిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంబేడ్కర్ సేవపై తాము రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ పెట్టటంత మొదలు.. బ్రిటన్ పార్లమెంటులో తాను ప్రసంగించే సమయంలో వివేకానంద.. గాంధీ.. అంబేడ్కర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించానని చెప్పటం ద్వారా దళితుల మీద తమకున్న కమిట్ మెంట్ ఎంత బలమైనదన్న విషయాన్ని తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి.

బ్రిటన్ లో అంబేడ్కర్ నివసించిన భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొనుగోలు చేశామని.. దేశంలో దళిత పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహాం ఇస్తున్న విషక్ష్న్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా.. దళితుల విషయంలో తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. దేశ వ్యాప్తంగా ఉన్న దళితుల మనసుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు.

మరీ.. మాటలు చెప్పటానికి హైదరాబాద్ ను ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న విషయాన్ని చూస్తే.. అందులోనూ వ్యూహం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలాంటి మాటలు చెబితే.. వాటికి ఉండే విశ్వసనీయతకు.. ఒక న్యూట్రల్ వేదిక మీద.. దళితుల మీద ఎలాంటి హాట్ టాపిక్ దేశ వ్యాప్తంగా నడవని సమయంలో ప్రస్తావించటం ద్వారా.. ఒక కొత్త చర్చకు తెర తీయటంతో పాటు.. దళితుల మీద తమ సర్కారుకు ఉన్న కమిట్ మెంట్ అంశంపై విస్తృతంగా ప్రచారం జరిగే వీలుంది. అందుకే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కీలకభూమిక పోషేంచే దళిత ఓటు బ్యాంక్ ను హైదరాబాద్ నుంచి మోడీ గురి పెట్టారని చెప్పొచ్చు.