Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఆశలకు చెల్లు చీటి...మోడీ వ్యాఖ్యలు వైరల్
By: Tupaki Desk | 23 Dec 2018 6:47 PM ISTకాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు స్పందించారు. మదురై - తిరుచిరాపల్లి - తిరువళ్లూరు - చెన్నై తూర్పు - ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మహాకూటమిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటు అవుతున్న మహాకూటమి ఓ ‘అపవిత్ర కూటమి’ అని అన్నారు. ‘కొందరు నేతలు మహాకూటమి గురించి మాట్లాడుతున్నారు. ఈ కూటమి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే. ఇది ఓ సిద్ధాంతం ప్రకారం ఏర్పాటవుతున్న కూటమి కాదు’ అని విమర్శించారు.
విపక్షాలు తమ వ్యక్తిగత - రాజకీయ మనుగడ కోసమే రానున్న లోక్ సభ ఎన్నికల కోసం మహాకూటమిగా ఏర్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. ఈ పార్టీలు అధికారం కోసం అపవిత్ర కలయికకు పూనుకున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు అర్రులు చాస్తోందని ప్రధాని ఎద్దేవా చేశారు. మహాకూటమి ప్రతిపాదన కేవలం వ్యక్తుల మనుగడ కోసమేనని - సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పాటయ్యేది కాదని మోడీ ఆరోపించారు. మహాకూటమిలో పలు పార్టీల నేతలు గతంలో ఎమర్జెన్సీ సమయంలో నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. మహాకూటమిలో కొన్ని పార్టీలు తమకు సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియా ఆదర్శమని చెప్పుకుంటున్నాయని - అయితే తాను కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని స్వయంగా రామ్ మనోహర్ లోహియా వెల్లడించారన్నారు. ఈ కూటమి ప్రజల కోసం కాదని అధికారం కోసమని, ప్రజా ఆకాంక్షల కోసం కాకుండా వ్యక్తిగత ఆకాంక్షల కోసమే వీరంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు.