Begin typing your search above and press return to search.

నరేంద్రమోడీ బయోపిక్ కు యూ సర్టిఫికెట్!

By:  Tupaki Desk   |   10 April 2019 5:42 AM GMT
నరేంద్రమోడీ బయోపిక్ కు యూ సర్టిఫికెట్!
X
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికేషన్ ఇచ్చింది. అనేక అవాంతరాల మధ్యన ఈ సినిమా సెన్సార్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అభ్యంతకరమైన సన్నివేశాలు లేవన్నట్టుగా, అన్ని వయసుల వారూ చూడదగిన సినిమాగా దీనికి యూ సర్టిఫికెట్ దక్కింది.

ఈ సినిమా విడుదల విషయంలో కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగా అభ్యంతరాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల కావడానికి వీల్లేదంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. అయితే కోర్టులో కాంగ్రెస్ పార్టీ వాదన వీగిపోయింది. నరేంద్రమోడీ బయోపిక్ విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పదకొండున ఈ సినిమా విడుదల అవుతోంది. అదే రోజున సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల కావడానికి వీల్లేదని కాంగ్రెస్ అంటే.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తొలి దశ రోజునే ఈ సినిమా విడుదల అవుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో నరేంద్రమోడీ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే మోడీగా వివేక్ లుక్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలో అతడు అటు వివేక్ ఒబెరాయ్ లానూ లేడు, ఇటు నరేంద్రమోడీలానూ లేడంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.

మరి అన్ని అడ్డంకులనూ దాటుకుని నరేంద్రమోడీ బయోపిక్ రేపు విడుదల కాబోతోంది. దీని బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో! ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో!