Begin typing your search above and press return to search.
అఫీసియల్!...రేపే మోదీతో బాబు భేటీ!
By: Tupaki Desk | 11 Jan 2018 5:50 PM ISTటీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏడాదిగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న చూపులకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి చంద్రబాబుకు అవకాశం చిక్కింది. రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రిత్వ కార్యాలయం అధికారికంగా ఈ విషయాన్ని ఏపీ సర్కారుకు తెలియజేసింది. ఎప్పుడెప్పుడు ఢిల్లీ నుంచి సమాచారం వస్తుందోనని ఆశగా ఎదురు చూసిన చంద్రబాబు... పీఎంఓ నుంచి సమాచారం రాగానే హస్తిన పర్యటనకు బయలుదేరేందుకు సిద్ధమైపోయారు. రేపు ఉదయం భేటీ ఉండగా.. నేటి సాయంత్రమే ఆయన విజయవాడలో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. అంటే... రేపు ఉదయం ప్రారంభం కానున్న ఈ భేటీలో ప్రధాని వద్ద ఏఏ అంశాలు ప్రస్తావించాలన్న అంశంపై చంద్రబాబు ఢిల్లీలోనే ఓ అవగాహనకు రానున్నారన్న మాట.
మొన్న ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలంతా కట్టగట్టుకుని మోదీని కలిసిన విషయం తెలిసిందే. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన సాయం - ఇతరత్రా ప్రోత్సాహకాలను ప్రస్తావించిన ఎంపీలు... బాబుతో భేటీని కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. అటు కేంద్రంతో పాటుగా ఇటు రాష్ట్రంలోనూ మిత్రపక్షాలుగా కొనసాగుతున్న బీజేపీ - టీడీపీల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వండంటూ టీడీపీ ఎంపీలు మోదీని అడగడం నిజంగానే ప్రాధాన్యం సంతరించుకుందనే చెప్పాలి. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారుకు రథసారథిగా ఉన్న బీజేపీకి చెందిన నేత - ప్రధాని నరేంద్ర మోదీ... కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుల మధ్య భేటీ జరిగి ఇప్పటికే ఏడాది పూర్తి అయిపోయింది. ఈ ఏడాది కాలంలో మోదీతో భేటీ అయ్యేందుకు చంద్రబాబు చాలా సార్లు యత్నించారు. అయితే బాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో మోదీ ఏమాత్రం కరుణ చూపలేదనే చెప్పాలి.
మిత్రపక్ష పార్టీ అదినేతగానే కాకుండా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న బాబుకు మోదీ ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న విషయంపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన టీడీపీ ఎంపీలు... పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని చక్రం తిప్పారు. వెరసి టీడీపీ ఎంపీల కృషి ఫలితంగా ఏడాది తర్వాత బాబుకు మోదీ అపాయింట్ మెంట్ లభించింది. ఇప్పటికే చంద్రబాబుకు మోదీ ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న విషయంపై నిన్నటిదాకా పలు రకాలుగా ఆలోచనలు చేసిన విశ్లేషకులు... మొన్న మోదీతో టీడీపీ ఎంపీల భేటీ తర్వాత అసలు... ఈ సారైనా బాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తారా? ఇస్తే గిస్తే.. మోదీ వద్ద చంద్రబాబు ప్రస్తావించే అంశాలు ఏమిటి? ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... రాష్ట్రం ఇబ్బందుల కంటే కూడా రాజకీయ ఎత్తుగడల మీదే వారిద్దరి మధ్య చర్చ జరుగుతుందా? లేదంటే రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే పలుచనైన తమ పరువును కాస్తంత పెంచుకునే దిశగా చంద్రబాబు రాష్ట్ర సమస్యలపైనే మోదీతో చర్చించి బయటకు వస్తారా? అన్న దిశగా విశ్లేషణలు చేస్తున్నారు.
ఇదే జరిగితే విభజన చట్టంలో ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన తోడ్పాటుపై బాబు గొంతెత్తే అవకాశాలున్నాయని ఓ వాదన వినిపిస్తున్నా... 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ... అసలు రాష్ట్ర సమస్యలు ప్రస్తావనకు వచ్చే ఛాన్సే లేదని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న నేతలతో పాటుగా సిట్టింగులు - గడచిన ఎన్నికల్లో అవకాశం దక్కని నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నియోజకవర్గాల పెంపు అంశాన్ని బాబు తప్పనిసరిగా ప్రస్తావిస్తారని - దీనిపై మోదీ ఏ విధంగా స్పందిస్తారన్న అంశంపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంతేకాకుండా గడచిన ఎన్నికల్లో జతకట్టి పోటీ చేసినా... వచ్చే ఎన్నికల్లో పొత్తు ఇరు పార్టీలకు కూడా నష్టమేనని ఇరు పార్టీల నేతలు ఎవరికి వారుగా ప్రకటనలు గుప్పించుకుంటున్నారు. ఈ తరహా ప్రకటనలు, ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతలు వాడుతున్న పరుష పదజాలంపై ఈ భేటీలో మోదీ - బాబు చర్చిస్తారా? అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఏదేమైనా... భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చినా... ఏఏ అంశాలు ప్రస్తావనకు రాకపోయినా... ఏడాది తర్వాత కలుస్తున్న మోదీ - బాబుల భేటీపై మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.