Begin typing your search above and press return to search.

నాగాల స్వరం మార్చేలా చేసిన మోడీ

By:  Tupaki Desk   |   4 Aug 2015 9:36 AM IST
నాగాల స్వరం మార్చేలా చేసిన మోడీ
X
బ్రిటీషోడు వదిలిపెట్టి పోయిన పంచాయితీ.. దశాబ్దాలుగా సాగుతూ.. నాగాలకు ప్రత్యేక దేశం కావాలని గళమెత్తటమే కాదు.. హింసను ఆయుధంగా మార్చుకొని పోరాడుతున్న పోరాటానికి సోమవారం మంగళం పాడటమే కాదు.. ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవటం జరిగింది.

ఈ వ్యవహారంలో ప్రధాని మోడీ కీలక భూమిక పోషించారు. నాగాలాండ్ లో శాంతి పవనాలు వీయటానికి వీలుగా.. అక్కడ పోరాటం చేస్తున్న సంస్థలు.. రాజకీయ పార్టీలతో కీలక ఒప్పందాన్ని కేంద్రం చేసుకుంది. దీంతో.. నాగా తీవ్రవాదాన్ని మటుమాయం చేసే అవకాశం దక్కినట్లు అయ్యింది.

సోమవారం ప్రధానమంత్రి నాగాలాండ్ కు చెందిన అన్నీ రాజకీయ పార్టీలు.. కీలక ఉద్యమ సంస్థలతో చర్చలు జరిపి.. సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయటంతో పాటు.. పోరాటానికి స్వస్తి పలికేలా నిర్ణయం తీసుకోవటం కీలక భూమిక పోషించారు. దీంతో దశాబ్దాలుగా సాగుతున్న నాగాల పోరాటం ముగిసినట్లు అయ్యింది.

వేర్పాటే తమ సమస్యకు పరిష్కారం అని నమ్మిన సంస్థల్ని సైతం.. నాగాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించటం ద్వారా.. వేర్పాటు ఆలోచనను తుంచేలా చేయగలిగారు మోడీ. తన వ్యక్తిగత చొరవతో ఇది జరిగిందని చెబుతున్నారు. అయితే.. మోడీ ఒక్కడిగానే ఈ సమస్యకు పరిష్కారం చూపలేదనే చెప్పాలి. ఆయన నాగాల సమస్య పరిష్కారం కోసం పెద్ద ప్రయత్నమే చేశారు.

మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్.. దేవగౌడలతో పాటు.. కాంగ్రెస్ నేత ఖర్గే.. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఎన్సీపీ నేత శరద్ పవార్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జెలియాంగ్.. డీఎంకే నేత కరుణానిధిలతో సుదీర్ఘ చర్చలు జరిపి.. పరిష్కార దిశగా అడుగులు వేశారు. సంకల్పం ఉండాలే కానీ.. సాధ్యం కానిది ఏదీ ఉండదన్న విషయాన్ని మోడీ తాజా ప్రయత్నంతో మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.