Begin typing your search above and press return to search.

తేడా ఎంతో: ఇద్ద‌రు అమ్మ‌లు.. రెండు ప్ర‌మాణ‌స్వీకారాలు!

By:  Tupaki Desk   |   31 May 2019 12:20 PM IST
తేడా ఎంతో: ఇద్ద‌రు అమ్మ‌లు.. రెండు ప్ర‌మాణ‌స్వీకారాలు!
X
ఒకేరోజు కొన్ని గంట‌ల తేడాతో జ‌రిగిన రెండు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాలకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి. ఇందులో ఒక‌టి గురువారం ఉద‌యం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ఒక‌టైతే.. రెండోది రాత్రి వేళ‌లో ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో అంగ‌రంగ‌వైభ‌వంగా సాగిన ప్ర‌ధాని మోడీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం. ఈ ఇద్ద‌రు ముఖ్య నేత‌ల‌కు సంబంధించిన ఒక పాయింట్ కామ‌న్.

వీరిద్ద‌రూ తాము చేసే ముఖ్య‌మైన ప‌నుల స‌మ‌యంలో త‌ల్లి ఆశీస్సులు తీసుకుంటారు. అమ్మ‌కు వీరిచ్చే ప్రాధాన్యంత అంతా ఇంతా కాదు. ఢిల్లీకి రాజైనా.. తాను మాత్రం ఆ త‌ల్లికి కొడుకే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. మ‌రి.. అలాంటి ఇద్ద‌రు నేత‌లు రాజ్యాధికారాన్ని స్వీక‌రిస్తున్న వేళ‌లో.. వారి త‌ల్లుల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను చూస్తే ఆస‌క్తిక‌రంగా అనిపించ‌క మాన‌దు.

మొద‌ట‌గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యానికి వ‌స్తే.. తాను ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంకు త‌న త‌ల్లికి.. కుటుంబ స‌భ్యుల‌కు వేదిక మీద ప్రాధాన్య‌త క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా ఒక త‌ల్లిగా విజ‌య‌మ్మ ఆనందాన్ని చూసినోళ్లంతా భావోద్వేగానికి గుర‌య్యారు. క‌ళ్ల ముందు కొడుకు త‌న క‌ల‌ను సాకారం చేసుకుంటూ ముఖ్య‌మంత్రి స్థానాన్ని సొంతం చేసుకున్న వైనాన్ని చూస్తూ ఆనంద‌భాష్పాలు కార్చారు. కొడుకును చూసి మురిసిపోయారు. జ‌గ‌న్‌.. విజ‌య‌మ్మ‌ల‌ను చూసిన వారంతా ముగ్దులైపోయారు.

క‌ట్ చేస్తే.. గురువారం రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం. దేశ ప్ర‌ధానిగా రెండోసారి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం చేసే కార్య‌క్ర‌మానికి ప‌లువురు విదేశీ ప్ర‌ముఖులు.. రాజ‌కీయ ప్ర‌ముఖులు.. కార్పొరేట్ దిగ్గ‌జాలు.. సినీ ప్ర‌ముఖుల మొద‌లు.. స‌న్యాసులు.. యోగులు.. ఇలా వివిధ రంగాల‌కు చెందిన ఎంతో మంది ప్ర‌ముఖుల్ని త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు.

ఇంత‌మందిని ఆహ్వానించిన మోడీ.. త‌న క‌న్న‌త‌ల్లిని మాత్రం పిల‌వ‌లేదు. త‌న‌కు జ‌న్మ‌నిచ్చి.. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు అంతో ఇంతో కృషి చేసిన ఆమె మాత్రం.. త‌న ఇంట్లో టీవీలో కార్య‌క్ర‌మాన్ని చూస్తూ.. కొడుకు ఉన్న‌తిని చూస్తూ చ‌ప్ప‌ట్లు కొట్టిన వైనం ప‌త్రిక‌ల్లోనూ.. సోష‌ల్ మీడియాలో చూస్తున్నాం. ఇదంతా మోడీ సింప్లిసిటీకి నిద‌ర్శ‌నంగా కొంద‌రు కీర్తించేస్తున్నారు. త‌మ నాయ‌కుడు కుటుంబానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌ర‌ని గొప్ప‌గా చెబుతున్నారు.

కుటుంబ స‌భ్యుల‌కు.. బంధువ‌ర్గాల‌కు ప‌వ‌ర్లో పార్టిసిపేట్ కాకుండా నియంత్రించ‌టం మంచిదే. కానీ.. క‌న్న‌త‌ల్లిని తాను సాధించిన విజ‌యాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌టం గొప్ప విష‌య‌మా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఆ మ‌ధ్య‌న డీఎంకే అధినేత క‌రుణానిధి అనారోగ్యంతో ఉంటే.. ఆయ‌న్ను ప‌రామ‌ర్శించ‌టానికి వెళ్లిన మోడీ.. ఆయ‌న్ను త‌న నివాసంలో ఉంచుకుంటాన‌ని.. మెరుగైన వైద్యం చేయిస్తాన‌ని అన్నారు. ఎవ‌రో బ‌య‌ట వ్య‌క్తి విష‌యంలో ఇంత జాగ్ర‌త్త ఉన్న మోడీ.. క‌న్న‌త‌ల్లి విష‌యంలో ఎందుకు ప‌ట్టించుకోర‌న్న‌ది ప్ర‌శ్న‌.

తాను ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించే కార్య‌క్ర‌మాన్ని త‌న త‌ల్లిని ఆహ్వానించి.. ఆమె ఎదుట చేస్తే.. ఆ మాతృమూర్తి సంత‌సించ‌కుండా ఉంటుందా? కొడుకు అంత గొప్ప‌గా ఎదిగిన‌ప్పుడు ఏ త‌ల్లికి ఆనందం ఉండ‌దు. కానీ.. అందుకు భిన్నంగా ఆమెను ఇంటికే ప‌రిమితం చేయ‌టం మోడీకి మాత్ర‌మే చెల్లుతుందేమో. ఒక కొడుకు త‌న త‌ల్లికి స‌ముచిత స్థానం ఇచ్చిన వైనం క‌నిపిస్తే.. మ‌రో కొడుకుత‌న త‌ల్లిని ఇంటికే ప‌రిమితం చేసి.. అది కూడా గొప్ప విష‌య‌మే అన్న‌ట్లుగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవ‌టం క‌నిపిస్తుంది. ఇద్ద‌రూ కొడుకులే. కానీ.. వారి మాతృమూర్తుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరు మాత్రం కాలం మౌనంగా తాను రాసుకోవాల్సింది రాసేసుకుంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.