Begin typing your search above and press return to search.

అదే నీచ రాజకీయ బుద్ధి బయటపెట్టుకున్న నారా లోకేష్!

By:  Tupaki Desk   |   12 Jun 2020 2:15 PM GMT
అదే నీచ రాజకీయ బుద్ధి బయటపెట్టుకున్న నారా లోకేష్!
X
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాజీ మంత్రి - టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా సవాల్ విసిరారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గత కొన్నేళ్లుగా ట్విట్టర్ మాధ్యమం ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఇతర వైసీపీ నేతలు కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఇప్పుడు నారాయణస్వామి లోకేష్‌ పై వరుసగా ట్వీట్లు చేశారు. ఇందులో భాగంగా తమ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని, నిరూపించకుంటే లోకేష్ - చంద్రబాబులు రాజకీయాలకు గుడ్‌ బై చెప్పగలరా అని ప్రశ్నించారు.

మహిళా డాక్టర్ అనితారాణికి అన్యాయం జరిగిందని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కూడా నారాయణ స్వామి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. సదరు మహిళా డాక్టర్ బాధితుడిగా చెబుతున్న భరత్ అనే యువకుడికి చెందిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు.

తాను అనితారాణిపై ఉద్దేశ్యపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని - అలాగే ఆమెను కులం పేరుతో దూషించలేదని - వైద్యం అందించలేదని ఫిర్యాదు చేశానని భరత్ ఓ వీడియోలో భరత్ చెప్పాడు. మేడంపై వ్యక్తిగత కక్షలేదని తెలిపాడు. మరో వీడియోలో ఏం జరిగిందో వివరించాడు. జనతా కర్ఫ్యూ రోజు తనకు గాయమైతే ఆసుపత్రికి వెళ్లగా అనితారాణి మేడం తలుపులు వేసుకున్నారని - దీంతో తాము ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశామన్నాడు. దీంతో తమపై ఎస్సీ - ఎస్టీ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తమపై కేసు పెట్టిన విషయం తెలిసి డాక్టర్ వద్దకు వెళ్లి తప్పు చేసి ఉంటే క్షమించమని కోరానని చెప్పాడు. అసలు ఆమె వైద్యం చేయకపోవడం వల్లే తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవలసి వచ్చిందన్నాడు. ఈ వీడియోలు పోస్ట్ చేసిన నారాయణస్వామి... దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని గతంలో మీ నాన్న చంద్రబాబు అన్నారని - ఈ వ్యాఖ్యలపై క్షమాపణ ఎప్పుడు చెప్పిస్తావని లోకేష్‌ ను ప్రశ్నించాడు. చికిత్స కోసం వచ్చిన ఓ సామాన్యుడికి వైద్యం చేయకుండా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ డాక్టర్ దౌర్జన్యంగా ప్రవర్తించారని - అలాంటి వారికి కులం కార్డు తగిలించి చంద్రబాబు రాజకీయం చేశారని - లోకేష్ కూడా అదే నీచబుద్ది బయట పెట్టుకున్నారన్నారు.