Begin typing your search above and press return to search.

యూకే ఆర్థిక మంత్రి అయిన నారాయ‌ణ మూర్తి అల్లుడు!

By:  Tupaki Desk   |   14 Feb 2020 1:30 AM GMT
యూకే ఆర్థిక మంత్రి అయిన నారాయ‌ణ మూర్తి అల్లుడు!
X
ఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ నారాయ‌ణ మూర్తి అల్లుడు రిషీ సున‌క్ యూకేలో మంత్రి అయ్యారు. కీల‌క‌మైన ఆర్థిక శాఖ బాధ్య‌త‌లు ఆయ‌న చేప‌ట్టారు. 39 యేళ్ల రిషీ సున‌క్ ఇలా బ్రిట‌న్ లో కీల‌క బాధ్య‌త‌లు పొందుతున్న ప్ర‌వాస భార‌తీయుడు అవుతున్నాడు. ఒక‌ప్పుడు భార‌త దేశాన్ని ఏలిన బ్రిట‌న్ కు ఇలా ఒక భార‌తీయుడు ఆర్థిక శాఖా మంత్రి అవుతుండ‌టం గ‌మ‌నార్హం. రిషీని ఆర్థిక శాఖ‌ మంత్రిగా నామినేట్ చేస్తూ బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.

రిషీ విద్యాధికుడు కావ‌డం, మేధావి కావ‌డంతోనే ఈ అవ‌కాశం ల‌భించింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో రిషీ పాలిటిక్స్ - ఫిలాస‌ఫీ - ఎక‌నామిక్స్ ను అభ్య‌సించాడు. అలాగే స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీఏ ప‌ట్టా పొందాడు. అలాగే బ్రిట‌న్ లోనే వ‌ర్సిటీల ఛాన్స‌ల‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించారు. 38 యేళ్ల వ‌య‌సులోనే ఛాన్స‌ల‌ర్ అయ్యి రిషీ పిన్న వ‌య‌సులోనే ఆ హోదాను పొందిన వ్య‌క్తిగా రికార్డు సృష్టించాడు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో రిచ్ మండ్ నుంచి రిషీ ఎంపీగా నెగ్గారు. ఇత‌డు పుట్టింది కూడా ఇంగ్లండ్ లోనే, హాంప్ షైర్ లో పుట్టిన రిషీ నారాయ‌ణ‌మూర్తి కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఇది వ‌ర‌కే బ్రిటీష్ ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన రిషీ ఇప్ప‌టికే ట్రెజ‌రీ సెక్ర‌ట‌రీగా కూడా ప‌ని చేశాడు. ఇప్పుడు బ్రిటీష్ ఆర్థిక మంత్రి అవుతున్నాడు.