Begin typing your search above and press return to search.

చిన‌బాబుకు దేవుడిచ్చిన గొప్ప‌వ‌రం ఆమేన‌ట‌!

By:  Tupaki Desk   |   27 Aug 2018 6:14 AM GMT
చిన‌బాబుకు దేవుడిచ్చిన గొప్ప‌వ‌రం ఆమేన‌ట‌!
X
రాజ‌కీయ అధినేత‌ల వార‌సుల మీద ప్ర‌జ‌ల అటెన్ష‌న్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. వారి మీద అంచ‌నాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. కొన్నిసార్లు బాగానే ఉన్నా.. చాలా సంద‌ర్భాల్లో వారిపై అదో ఒత్తిడిగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక‌.. అధినేత రాజ‌కీయ వార‌సుడి మీద పోలిక‌లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి.

ఎంత‌సేపూ ఎవ‌రో ఒక‌రితో పోలుస్తూ ఉండ‌టం క‌నిపించ‌టం మామూలే. ఎక్క‌డిదాకానో ఎందుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడికి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేటీఆర్ కు వ‌య‌సు ప‌రంగా చూస్తే వ్య‌త్యాసం ఎక్కువే. ఇద్ద‌రి మ‌ధ్య ఏడేళ్లు తేడా ఉంది.

అయిన‌ప్ప‌టికీ.. ఇరువురిని త‌ర‌చూ పోలుస్తూ ఉండే వారు ఎక్కువే ఈ కార‌ణంతోనే కావొచ్చు కేసీఆర్ త‌న కుమారుడ్ని మంత్రిని చేసి.. ఐటీ శాఖ‌ను అప్ప‌జెబితే.. చంద్ర‌బాబు సైతం లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకొని ఐటీ శాఖ‌ను అందించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. వీరిద్ద‌రి మ‌ధ్య పోలిక‌ల్ని కాసేపు ప‌క్క‌న పెట్టి లోకేశ్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ట్వీట్లు చేసినా.. మ‌రేం మాట్లాడినా.. అన్ని రాజ‌కీయం చుట్టూనే తిరుగుతాయి త‌ప్పించి వ్య‌క్తిగ‌త విష‌యాన్ని మీడియాతో పెద్ద‌గా పంచుకోవ‌టం క‌నిపించ‌దు.

సోష‌ల్ మీడియాలోనూ ఆయ‌న ఎంత‌సేప‌టికి రాజ‌కీయ అంశాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావిస్తారు. జోవియ‌ల్ గా రియాక్ట్ కావ‌టం లోకేశ్ ద‌గ్గ‌ర క‌నిపించ‌దు. అలాంటి ఆయ‌న తాజాగా చేసిన ఒక ట్వీట్ వైర‌ల్ గా మారింది. ఎందుకంటే.. త‌న స్వ‌భావానికి విరుద్ధంగా లోకేశ్ తాజా ట్వీట్ ఉండ‌టమే కార‌ణం.

బ్రాహ్మ‌ణితో త‌న వివాహం జ‌రిగి 11 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంలో ఆయ‌నొక ట్వీట్ చేశారు. అందులో త‌మిద్ద‌రి ఫోటోను షేర్ చేసిన ఆయ‌న‌.. గ‌డిచిన 11 ఏళ్లుగా ప్రేమ‌.. అప్యాయ‌త‌లు నిరంత‌రాయంగా అందుతున్నాయ‌ని పేర్కొన్నారు. త‌న‌కు భ‌గ‌వంతుడు ఇచ్చిన గొప్ప వ‌రం బ్రాహ్మ‌ణి అని పేర్కొన్నారు. అందుకు భ‌గ‌వంతుడికి థ్యాంక్స్ చెప్పారు.

హ్యాపీ యానివ‌ర్స‌రీ అంటూ బ్రాహ్మ‌ణికి శుభాకాంక్ష‌లు తెలిపిన ఆయ‌న‌.. ట్వీట్ వైర‌ల్ గా మారింది. తాము జంట‌గా ఉన్న ఫోటోను షేర్ చేసిన ట్వీట్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు అందాయి.

పెళ్లి స‌మ‌యంలో లోకేశ్ రాజ‌కీయాల్లో చురుగ్గా ఉండ‌క‌పోవ‌టం.. త‌ర్వాతి కాలంలో ఆయ‌న పార్టీలో పని చేసి.. రెండు ఎన్నిక‌ల వేళ‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. విభ‌జ‌న అనంత‌రం ఏపీలో బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డినప్ప‌టికి మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌లేదు. త‌ర్వాతి కాలంలో కొడుకును ఎమ్మెల్సీగా చేసి.. మంత్రివ‌ర్గంలో స్థానాన్ని క‌ల్పించారు.