Begin typing your search above and press return to search.

లోకేష్ వాళ్ల పెద్ద అమ్మను కలువబోతున్నాడా?

By:  Tupaki Desk   |   11 Jun 2020 8:50 AM GMT
లోకేష్ వాళ్ల పెద్ద అమ్మను కలువబోతున్నాడా?
X
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతుంటాయి. రాజకీయాల్లో ప్రతీ ఐదేళ్లకు అధికారంతోపాటే పార్టీల బలాబలాలు కూడా మారిపోతుంటాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి జంప్ అయిపోతుంటారు నేతలు. గత హయాంలో టీడీపీది నడిస్తే ఇప్పుడు వైసీపీది నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ హవా కొనసాగుతోంది. జగన్ ఎలాగూ రానీయడు కాబట్టి టీడీపీలోని చంద్రబాబు అనుంగ శిష్యులు రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి - సీఎం రమేశ్ - టీజీ వెంకటేశ్ తదితరులు బీజేపీలో చేరిపోయారు. ఎందుకంటే తమ వ్యాపారాలు - ఆస్తులు కాపాడుకోవాలంటే అధికార పార్టీలో ఉండడం తథ్యం కావడంతో నేతలంతా అలా వలస పోతుంటారు.

టీడీపీలోని పెద్ద మనుషులు ఎప్పటి నుంచో దారిపడుతున్నారు. తాజాగా సీనియర్ టీడీపీ నేత సిద్ధా రాఘవరావు కూడా చంద్రబాబుకు హ్యాండిచ్చి వ్యాపార ప్రయోజనాల కోసమే వైసీపీలో చేరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. టీడీపీకి ఇన్నాళ్లు అన్ని విధాలుగా ఆర్థికంగా.. సామాజికంగా సాయమందించిన సీనియర్ నాయకులు ఇప్పుడు బిజినెస్ లు లాస్ చేసుకోకుండా అధికార పార్టీలోకి జంప్ అవుతున్న వైనం కనిపిస్తోంది. దీంతో టీడీపీ పరిస్థితి దిగజారుతోంది.

ఇదే సమయంలో అధికార పార్టీలో ఓడిన వారు.. ప్రాధాన్యం దక్కని వారు కూడా పక్కచూపులు చూస్తున్నారు. వారిని లాగాలని తాజాగా టీడీపీ స్కెచ్ గీస్తోందట.. వైసీపీలో - బీజేపీలో అసమ్మతి లిస్ట్ ఒకటి తీసుకొని కరోనా పూర్తి అయిన తర్వాత వాళ్ల అందరినీ కలిసి వారిని టీడీపీలో చేర్చుకునే ఎత్తుగడను చంద్రబాబు అమలు చేయబోతున్నారని టీడీపీ వర్గాల టాక్.

తాజాగా బాలక్రిష్ణ బర్త్ డే వేడుక కొత్త రాజకీయ సమీకరణాలకు వేదికైందట.. బాలయ్య బర్త్ డేకు నందమూరి కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. ఈ సమయంలోనే బాలక్రిష్ణతో కుటుంబం సమవేశం అయ్యి ఫ్యామిలీ అంతా ఒకటి కావాలని అని డిసైడ్ అయ్యారట.. నారా లోకేష్ ఈ మేరకు చొరవ కూడా తీసుకున్నాడట.. బీజేపీలో అసమ్మతిగా ఉన్న వాళ్ల పెద్ద అమ్మ - కేంద్ర మాజీ మంత్రి అయిన దగ్గుబాటి పురంధేశ్వరి - వాళ్ల పెద్ద నాన్న ఇటీవల వైసీపీలో నుంచి బయటకి వచ్చారు. వాళ్ల కుమారుడికి లోకేష్ తో ఇంకా సత్సంబంధాలు ఉన్నాయట.. వారిని టీడీపీలోకి తీసుకొచ్చి అగ్రతాంబూలం ఇచ్చేందుకు లోకేష్ బాబు ప్రయత్నాలు ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది.

టీడీపీ కుదేలైన ఈ సమయంలో నందమూరి కుటుంబం మద్దతు అవసరం ఉంది అని.. దగ్గుబాటి కుటుంబానికి ఇప్పుడు రాజకీయంగా గట్టి మద్దతు కావాలి కాబట్టి లోకేష్ బాబు పోయి అడిగితే దగ్గుబాటి ఫ్యామిలీ ఖచ్చితంగా ఆలోచిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాడు ఎన్టీఆర్ ను గద్దెదించిన సమయంలో ఇదే చంద్రబాబు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును మోసం చేశాడనే అపవాదు కూడగట్టుకున్నారు. కానీ ఈసారి చంద్రబాబు వాళ్లను మోసం చేయకుండా చూసే బాధ్యత బాలక్రిష్ణ తీసుకుంటాడని.. ఈ మేరకు బాలయ్య కూడా నందమూరి ఫ్యామిలీని ఒక్కటి చేసేందుకు తన అల్లుడు లోకేష్ బాబుతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించారని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.