Begin typing your search above and press return to search.

బాల‌య్య మాట‌ల‌తో ఇర‌కాటంలో లోకేష్‌

By:  Tupaki Desk   |   1 July 2017 11:40 PM IST
బాల‌య్య మాట‌ల‌తో ఇర‌కాటంలో లోకేష్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బావ‌మ‌రింది - ప్ర‌ముఖ సినీన‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లపై ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ వినిపిస్తోంది. నెల్లూరులో నూడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ ప‌లు అంశాల‌పై స్పందించే క్ర‌మంలో త‌న తండ్రి - దివంగ‌త ఎన్టీఆర్ పేరును ప్ర‌స్తావిస్తూ ఆనాటి రోజుల‌ను గుర్తుచేసుకున్నారు. అయితే ఈ క్ర‌మంలో త‌న తండ్రి రాజ‌కీయ జీవితం గురించి ప్ర‌స్తావించే క్ర‌మంలోచేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశం పార్టీ యువ‌నేత నారా లోకేష్‌ ను ప్ర‌స్తావించిన‌ట్లు చెప్తున్నారు.

త‌న తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు తాను ఎన్న‌డూ ఆయ‌న వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోలేద‌ని బాల‌య్య తెలిపారు. స‌చివాల‌యం వైపు వెళ్ల‌డం, ఏదైనా ప్ర‌త్యేకమైన పైర‌వీలు చేయ‌డం వంటి అంశాల్లో తాను జోక్యం చేసుకోలేద‌ని వెల్ల‌డించారు. అయితే ఈ వ్యాఖ్య‌లు లోకేష్‌ ను టార్గెట్ చేసిన‌ట్లు ఉన్నాయ‌ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మంత్రి కాక ముందు నుంచే ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్పుతున్నార‌నే ప్ర‌చారం ఉన్న సంగ‌తి తెలిసిందే. మీడియా లైజ‌నింగ్ ఆఫీస‌ర్ (ఎమ్మెల్వో)ల పేరుతో లోకేష్ త‌న మ‌నుషులంద‌రినీ మంత్రుల ద‌గ్గ‌ర ఉంచి వారిపై నిఘా వేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌తిఘ‌టించిన‌ట్లు కూడా అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో మంత్రుల‌తో ప్ర‌త్యేకంగా లోకేష్ స‌మావేశ‌మై ప‌లు అంశాలు చ‌ర్చించారు. స‌చివాల‌యంలో సీసీ కెమెరాలు పెట్టించార‌నే ప్ర‌చారం సైతం సాగింది.

త‌న తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో స‌చివాల‌యం వైపు చూడ‌లేద‌నే మాట‌ను చెప్ప‌డం ద్వారా వివిధ రూపాల్లో ప్ర‌భుత్వంలో పెరిగిపోయిన లోకేష్ జోక్యాన్ని పరోక్షంగా బాల‌య్య ప్ర‌స్తావించారా అనే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లోసాగుతోంది. మొత్తంగా బాల‌య్య త‌న గురించి చెప్తూ అల్లుడిని ఇర‌కాటంలో ప‌డేశార‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/