Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌.. లోకేశ్ ట్వీట్ల తేడా గ‌మ‌నించారా?

By:  Tupaki Desk   |   6 April 2018 5:46 PM IST
జ‌గ‌న్‌.. లోకేశ్ ట్వీట్ల తేడా గ‌మ‌నించారా?
X
పూట‌కొక‌సారి మీడియాతో మాట్లాడుతూ.. చెప్పిందే చెబుతూ.. పాడిందే పాడ‌రా అన్న సామెత చందంగా వ్య‌వ‌హ‌రించాలా? కామ్ గా చేయాల్సిన ప‌ని చేసేస్తూ.. ఏం చెప్పామో.. అదే చేస్తూ.. మాట మీద నిల‌బ‌డుతూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలా? అని అడిగితే మీరేం చేస్తారు? ఎవ‌రికి మీ మ‌ద్ద‌తు ఇస్తారు? అని అడిగితే ఎవ‌రైనా మాట మీద నిల‌బ‌డే వారికి.. మాట‌ల కంటే చేత‌ల్లో చూపించే వారి వెంటే ఉంటామ‌ని చెబుతారు.

ఏపీ రాజ‌కీయాల్ని చూస్తే.. హోదా విష‌యంలో త‌క్కువ మాట్లాడిన వారిలో జ‌గ‌న్ క‌నిపిస్తారు. కానీ.. హోదా మీద నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు చేసిన వారిలోనూ జ‌గ‌న్ ప్ర‌ముఖంగా కనిపిస్తారు. గ‌డిచిన ప‌ది రోజులుగా చంద్ర‌బాబు నానా హ‌డావుడి చేస్తున్నారు. మోడీని అదే ప‌నిగా విమ‌ర్శిస్తున్నారు. ఇంత‌కు మించి ఆయ‌న ఏమైనా చేస్తున్నారా? అంటే లేద‌ని చెప్పాలి. హోదా సాధ‌న‌లో భాగంగా మోడీ స‌ర్కారు తీరును బ‌జార్లో పెట్టేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్సే. ఆ త‌ర్వాత తాను చేస్తున్న త‌ప్పును గుర్తించిన చంద్ర‌బాబు జ‌గ‌న్ పార్టీకి పోటీగా త‌మ పార్టీ ఎంపీల చేతా అవిశ్వాస తీర్మానాన్ని ఇప్పించ‌టం చూస్తున్నాం.

లోక్ స‌భ స‌మావేశాల చివ‌రి రోజున త‌మ ఎంపీలు రాజీనామా చేసి.. ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేస్తార‌ని ప్ర‌క‌టించి.. అదే ప‌నిని చేస్తుంది జ‌గ‌న్ పార్టీ ఎంపీలైతే.. కేవ‌లం మాట‌ల‌తో.. మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించేలా హ‌డావుడి చేయ‌టంలో మాత్ర‌మే ఏపీ అధికార‌ప‌క్షంగా చెప్పాలి.

త‌మ ఎంపీలు రాజీనామా లేఖ‌ల్ని లోక్ స‌భ స్పీక‌ర్ కు అంద‌జేసిన త‌ర్వాత ట్విట్ట‌ర్ లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర బాబుకు ఒక స‌వాలు విసిరారు. త‌మ ఎంపీల చేత రాజీనామా చేయించిన నేప‌థ్యంలో.. మీరు కూడా క‌లిసి వ‌స్తారా? అని. దీనికి ప్ర‌తిగా బాబు కాకుండా చిన‌బాబు రియాక్ట్ అయ్యారు.

తాము ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కూ పోరాడుతున్న‌ట్లు చెప్పారు. న్యాయం కోసం తాము పోరాడుతుంటే..జ‌గ‌న్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్న‌ట్లుగా ఎద్దేవా చేశారు.హోదా కోసం అంద‌రం క‌లిసి క‌ట్టుగా పోరాడ‌దామ‌ని జ‌గ‌న్ ట్వీట్ చేస్తూ.. హోదా పోరాటంలో ప్ర‌జ‌ల‌కు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంద‌ని ట్వీట్ చేస్తే.. లోకేశ్ మాత్రం ఎంపీ కోసం జ‌గ‌న్ ఎక్క‌డా గొంతు ఎత్త‌లేద‌ని.. కోర్టుల్లో చేతులు క‌ట్టుకోవ‌టం.. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల్లో బిజీగా ఉన్నారంటూ స‌టైర్ వేశారు.

జ‌గ‌న్‌.. లోకేశ్ ట్వీట్లు చూస్తే.. హోదా విష‌యంలో విప‌క్ష నేత క‌మిట్ మెంట్ క‌నిపిస్తే..చిన‌బాబు ట్వీట్ల‌లో ఎట‌కారం.. ఎక్క‌సం క‌నిపిస్తూ.. అడిగిన ప్ర‌శ్న‌కు సంబంధం లేని రీతిలో స‌మాధానం చెప్ప‌టం క‌నిపిస్తుంది. అధికారంలో ఉన్న‌ప్పుడు త‌లా తోకా లేకుండా స‌మాధానాలు చెప్పినోళ్లంతా త‌ర్వాత కాలంలో అధికారానికి దూర‌మైన ఉదంతాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి అవ‌గాహ‌న లేని రీతిలో లోకేశ్ ట్వీట్లు ఉన్నాయ‌ని చెప్పాలి.

ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కూ తాము పోరాడుతున్న‌ట్లుగా చెబుతున్న లోకేశ్‌.. మ‌రి ఎంపీ ప‌ద‌వుల్ని తృణ‌ప్రాయంగా ఎందుకు వ‌దిలిపెట్ట‌లేక‌పోతున్నారు? ఏ ప్ర‌యోజ‌నాలు ఆశించి రాజీనామాలు చేయ‌కుండా ఉన్నారు. తెలంగాణ ఉద్య‌మాన్నే చూస్తే.. ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టం.. ఉప ఎన్నిక‌ల్ని ఎదుర్కోవ‌టం ద్వారా ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ ను ర‌గ‌ల్చ‌ట‌మే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఇవ్వ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. చ‌రిత్ర మీద అవ‌గాహ‌న లేని చిన‌బాబు లాంటోళ్లు మాట్లాడే మాట‌లు ఎంత చిన్న‌గా ఉంటాయో తాజాగా చేసిన ట్వీట్ చెప్పేస్తుంద‌ని చెప్పాలి.