Begin typing your search above and press return to search.

లోకేష్ కు ట్వీట్ షాక్ తగిలింది

By:  Tupaki Desk   |   11 Jan 2016 5:50 AM GMT
లోకేష్ కు ట్వీట్ షాక్ తగిలింది
X
అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఏంటో ఇప్పుడు నారా లోకేష్ ను అడగాలి. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రుల ఓట్ల కోసం టీఆర్ ఎస్ చేస్తున్న ప్రయత్నాల మీద లోకేష్ తన ట్వీట్ లో విమర్శించాడు. "టీఆర్ ఎస్ ది రెండు నాలుకల సంస్కృతి. ఒక నాలికతో ఆంధ్రులను తిడుతుంది. మరో నోటితో వారి ఓట్లను అడుగుతుంది" అని తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ​కు ​నెటిజన్ల నుండి లోకేష్ కు ఊహించని విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ఓ రకంగా లోకేష్ మీద విరుచుకుపడ్డారనే చెప్పాలి. తెలంగాణనే కాదు ..ఆంధ్ర నెటిజన్లు కూడా లోకేష్ వైఖరిని తప్పుబట్టారు. "మేము హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్నాం .. మీ ఓట్ల కోసం మమ్మల్ని వాడుకోవద్దు" అని ఒక ఆంధ్రా నెటిజన్ రీట్వీట్ చేస్తే .."మీ నాన్న రెండు కళ్ల సిద్దాంతానికి తెలంగాణలోని వెయ్యి మంది యువకులు బలయ్యారు" అని తెలంగాణ నెటిజన్ విమర్శించాడు.

ఆంధ్రలో ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. "ఇంటికో ఉద్యోగం ఏమయింది ? బెల్టు షాపులను ఎత్తేసే పని ఏమయింది ? డ్వాక్రా మహిళల, రైతుల రుణమాఫీ ఏమయింది ? ముందు ఆంధ్రాలో మీ హామీలు అమలు చేసి అవతలి వాళ్లను అడుగు" అని ఒకరన్నారు. "నీకెందుకు పాలిటిక్స్ తిన్నామా ? పడుకున్నామా ? తెల్లారిందా ? ఆంధ్రలో మీ నాన్న ఎన్ని వాగ్ధానాలు చేసి ఎన్ని నెరవేర్చాడు" అని మరొకరు ప్రశ్నించారు. 'రెండు కళ్లు ..కొబ్బరిచిప్పల సిద్దాంతాలు మీవే కదా ' అని ఇంకొకరు స్పందించారు. మొత్తానికి వందల కొద్దీ రీ ట్వీట్లతో లోకేష్ మీద ప్రశ్నలు, విమర్శల వర్షం కురుస్తోంది.