Begin typing your search above and press return to search.
పవన్ కు పంచ్ ఇచ్చేలా లోకేశ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 8 Dec 2017 12:13 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. ఏపీ మంత్రి లోకేశ్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. గడిచిన మూడు రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పలు సందర్భాల్లో పలు సమస్యల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఉదయం సమస్యలు.. సాయంత్రం పార్టీ వర్గాలతో సమావేశమవుతున్న ఆయన.. పార్టీ వర్గాలతో మాట్లాడే సందర్భంగా వారసత్వ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తండ్రి సీఎం అయితే కొడుకు సీఎం కావాలని అనుకోవటం తప్పంటూ ఏపీ విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే.. పవన్ మాటలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్లు పడ్డాయి. జగన్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్న ప్రశ్నల్ని తెర మీదకు తీసుకొచ్చారు.
తన ప్రస్తావన తీసుకురాని పవన్ ను ఇరుకున పెట్టేలా.. తాజాగా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్‌కు పంచ్ లు మాదిరి మారాయి. వారసులుగా తాము సమర్థవంతంగా పని చేయకుంటే రాజకీయాల్లో నిలబడలేమని వ్యాఖ్యానించారు. వారసులుగా అవకాశం వచ్చిన మాట వాస్తవమే కానీ ప్రజామోదం ఉంటేనే నిలబడగలమన్నారు. మరి.. లోకేశ్ వ్యాఖ్యలు చూసినప్పుడు తండ్రి మరణించే నాటికి ఎంపీగా గెలుపొంది.. వంద రోజులు పూర్తి చేసుకున్న జగన్ కంటే అర్హుడు ఎవరుంటారు? పవన్ చేసిన వ్యాఖ్యలు తప్పన్న విషయాన్ని లోకేశ్ తన తాజా వ్యాఖ్యలతో చెప్పేసినట్లే కదా?