Begin typing your search above and press return to search.

నిర‌స‌న సీన్లోకి వ‌చ్చేసిన చిన‌బాబు

By:  Tupaki Desk   |   1 April 2018 11:53 AM IST
నిర‌స‌న సీన్లోకి వ‌చ్చేసిన చిన‌బాబు
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ గ‌ళం విప్పిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నెమ్మ‌ది నెమ్మ‌దిగా త‌న స్వ‌రాన్ని పెంచుతున్నారు. మోడీపై నేరుగా తిట్ల దండ‌కాన్ని లంకించుకుంటున్నారు. త‌న‌ను ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మాలంటే మోడీపౌ ఎంత ఘాటు విమ‌ర్శ‌లు చేస్తే కానీ.. అంత‌గా మైలేజీ వ‌స్తుంద‌ని భావిస్తున్న ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న విమ‌ర్శల తీవ్ర‌త‌ను పెంచేశారు.

ప్ర‌త్యేక హోదాపై మోడీ స‌ర్కారుపై బాబు వార్ డిక్లేర్ చేసినా.. చిన‌బాబు మాత్రం ఈ మిష‌న్ లో కాస్తంత దూరంగానే ఉన్నారు. తండ్రికి త‌గ్గ‌ట్లు ఘాటు విమర్శ‌లు చేయ‌లేదు. తాజాగా త‌న రూట్ ను లోకేశ్ మార్చేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. తండ్రి మాదిరి కాకున్నా.. మోడీ స‌ర్కారును త‌ప్పు ప‌ట్టే విష‌యంలో త‌న‌దైన శైలిలో ముందుకు వెళుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ హోదా ఇష్యూలో మోడీని త‌ప్పు ప‌ట్ట‌ని లోకేశ్‌.. తాజాగా మాత్రం త‌న ట్విట్ట‌ర్ ఖాతా డీపీ (డిస్ ప్లే పిక్చ‌ర్‌)ను మార్చేశారు.

#ఏపీ వేర్స్ బ్లాక్ బ్యాడ్జ్ నినాదాన్ని అందుకున్న ఆయ‌న‌.. బ్లాక్ బ్యాగ్రౌండ్ లో తెల్ల‌టి అక్ష‌రాలు వ‌చ్చేలా చేశారు. హోదాపై కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా బ్లాక్ రిబ్బ‌న్ ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ధ‌రిస్తున్నారు. ఆయ‌న మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. పార్టీ నేత‌లు.. అధికారులు అదే తీరులో ఫాలో అవుతున్నారు.

గ‌డిచిన కొంత‌కాలంగా కామ్ గా ఉన్న లోకేశ్ ఏమ‌నుకున్నారో ఏమో కానీ.. ఉన్న‌ట్లుండి త‌న సోష‌ల్ ఖాతాలో డీపీని మార్చ‌టంతో పాటు.. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై గ‌ళం విప్పారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం త‌మ‌ను మోసం చేసింద‌ని.. 5 కోట్ల ఆంధ్రుల జీవితాల్ని ప్ర‌భావితం చేసింద‌న్నారు. ట్విట్ట‌ర్ లో పోస్టు ద్వారా త‌న సోష‌ల్ మీడియా ఫైట్ ను షురూ చేసిన చిన‌బాబుపై మోడీ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతుందో..?