Begin typing your search above and press return to search.
చినబాబు దృష్టిలో పవన్..?
By: Tupaki Desk | 3 Sept 2016 10:00 AM ISTఎప్పుడూ లేని విధంగా ఈసారి పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఊహించని కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. తమ అభిమాననేత పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో పవన్ అభిమానులు ప్రత్యేక హోదా అంశంపై ధర్నా నిర్వహిస్తే.. విలక్షణ దర్శకుడు వర్మ.. పవన్ ను ఏ రేంజ్లో పొగిడేశారు. ఇది సరిపోదన్నట్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడు కమ్ టీడీపీ యువనేత లోకేశ్ నోటి నుంచి ఎవరూ ఊహించని రీతిలో పవన్ పొగిడేయటం విశేషం.
ప్రత్యేక హోదా అంశంపై సరిగ్గా వారం క్రితం టీడీపీ ఎంపీల్ని ఫవన్ కడిగేయటాన్ని మర్చిపోకూడదు. కేసులకు బయపడుతున్నారా? అన్న వ్యాఖ్యను తనకు అపాదించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పవన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన విషయాన్ని మర్చిపోకూడదు. ఇక.. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు అయితే పవన్ మీద ఎంతలా విరుచుకుపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా..తెలుగు తమ్ముళ్లు ఒకరి తర్వాత ఒకరుగా పవన్ కల్యాణ్ పై విరుచుకుపడితే.. అందుకు భిన్నంగా చినబాబు పవన్ ను పొగిడేయటం గమనార్హం
పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ఆయన.. బర్త్ డే శుభాకాంక్షలు చెప్పటమే కాదు. పవన్ ఒక అద్భుతమైన వ్యక్తిగా కీర్తించారు. ‘వండర్ ఫుల్ పర్సన్. చక్కటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి’’ అంటూ లోకేశ్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. చినబాబే ట్వీట్ తో పవన్ ను పొగిడేసిన వేళ.. తెలుగు తమ్ముళ్ల నోటికి తాళాలు పడనున్నాయా..?