Begin typing your search above and press return to search.
లోకేశా... ఇదేం రాజకీయమయ్యా.. ?
By: Tupaki Desk | 17 Dec 2021 7:00 PM ISTచంద్రబాబు తరువాత సీటు ఆయనదే. పార్టీలో పెదబాబు జాతీయ అధ్యక్షుడు అయితే చినబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి. ఒక విధంగా తండ్రి తరువాత అంతలా అని ఈ పాటికే పేరు తెచ్చుకోవాలి. కానీ లోకేష్ రాజకీయం అంతా ఏదోలా సాగుతోంది. దానికి కారణం కూడా ఆయన అనుసరిస్తున్న వైఖరే అని చెప్పాలి. కనిపించింది కదా అని పక్క వారి పార్టీ ఆఫీస్ కి వెళ్లి ఈ రోజు నుంచి మనం మనం భాయీ భాయీ అనడమేంటి అన్న చర్చ అంతటా జరుగుతోంది.
లోకేష్ గుంటూర్ జిల్లా టూర్ లో ఆయన హఠాత్తుగా జనసేన ఆఫీస్ లోకి వెళ్ళి హడావుడి చేశారు. మనం రాబోయే రోజుల్లో కలసి పనిచేయాలని అని కూడా అన్నట్లుగా చెబుతున్నారు. దానికి లోకల్ జనసైనికులు అయితే అది అధినాయకత్వం చూసుకుంటుంది అని నవ్వుతూనే చెప్పారట. మొత్తానికి టీడీపీఎ అధినాయకత్వం స్థాయి అనదగిన లోకేష్ వచ్చి అలా లోకల్ లీడర్లతో కలసి పనిచేద్దమని అనడమే వింతా విడ్డూరమూనూ.
పొత్తులు అంటే ఎలా ఉంటాయి. అవి ఎక్కడ కుదురుతాయి. వాటికి ఉన్న సీరియస్ నెస్ ఏంటి అన్నది కూడా లోకేష్ కి అర్ధం కావడంలేదా అన్న చర్చ అయితే వస్తోంది. నిజానికి ఎన్నికలు చూస్తే గట్టిగా రెండున్నరేళ్ల దూరంలో ఉన్నాయి. అప్పటికి ఎన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటారో ఎవరికి తెలుసు. ఈ లోగా వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయి టీడీపీకే ఒక్కసారిగా ఆదరణ పెరగవచ్చు కదా. అపుడు పొత్తులు అని వెనకటి మాటకు కట్టుబడి త్యాగరాజులు అవుతారా. టోటల్ గా తామే దున్నేస్తారా. ఒక వేళ అలా కాకున్నా ఆనాటి పరిస్థితుల్లో పెద్దన్న పాత్ర వహించాలని మిగిలిన పార్టీలేవో వచ్చి టీడీపీని అడగవచ్చు కదా.
అలా పెద్దరికం నిలుపుకుంటూ సరైన సమయం కోసం చూడడం పరిపక్వత కలిగిన రాజకీయం. కానీ లోకేష్ కి పొత్తులు అంటే పిల్లాటగా మారిందా అన్న మాట వినిపిస్తోంది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక వైపు చాలా బ్యాలన్స్ గా మాట్లాడుతున్నారు. ప్రజలు దీవించి మాకు అధికారం ఇస్తే అంటూ ఆయన జనసేన ఒంటరి పోరుకే అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
అదే విధంగా బీజేపీ కూడా తన పని తాను చేసుకుంటూ పోతోంది. జనసేనతోనే మా పొత్తు అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇలా ప్రతీ పార్టీ కూడా ప్రజా పోరాటాలతోనే బిజీగా ఉంటున్నాయి తప్ప ఈ రోజుకు పొత్తుల మాట ఎత్తడంలేదు. మరి అందరికీ లేని ఆత్రం టీడీపీకి ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇలా పొత్తుల కోసం అంగలు చాచడం కూడా రాజకీయ బేలతనాన్ని సూచిస్తుంది తప్ప మరోటి కానే కాదని అంటున్నారు.
టీడీపీ ఈ రోజుకు చూసుకున్నా ఏపీలో బలమైన పార్టీ. అది అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆత్మ న్యూనత, తమ మీద తమకు నమ్మకం లేకపోవడం వల్లనే క్యాడర్ ఎపుడైనా డీ మోరలైజ్ అవుతుంది. నాయకుడు అన్న వారు అయితే మనమే గెలుస్తాం, మనమే పోటీ ఒంటరిగా చేస్తామని ఎపుడూ గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. అలాంటి పవర్ ఫుల్ వ్యూహాలు మానేసి ఎన్నికలు ఎంతో దూరంగా ఉండగానే పక్క పార్టీ వారి భుజాల మీద చేయి వేస్తూ పోవడం అంటే ఉన్న పార్టీని, నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టినట్లు కాదా లోకేశా అంటున్నారు అంతా.
ఇలా ఉన్న కాడె వదిలేసి మధ్యలోనే పొత్తులు అంటే చివరికి అవి కుదరకపోతే నష్టం ఎవరికో యువ నాయకుడు చెప్పగలరా అన్న మాట కూడా వినిపిస్తోంది. పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడం అంటే పక్కవారితో పొత్తులుంటాయి చెప్పడం కాదు, అప్పు తెచ్చుకున్న బలం చూపించడం అంతకంటే కాదు, క్షేత్ర స్థాయిలో ధైర్యంగా నిలిచి పోరాడడం. మరి చంద్రబాబు ఒక వైపు టీడీపీని గట్టెక్కించడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్న వేళ లోకేష్ ఇలా చేయడమేంటి అన్న చర్చ అయితే సొంత పార్టీలోనే వస్తోంది. మరి దీని ఫలితాలు పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.