Begin typing your search above and press return to search.

ఏపీలో భూరికార్డుల్ని డిజిట‌లైజేష‌న్‌!

By:  Tupaki Desk   |   25 July 2018 2:23 PM IST
ఏపీలో భూరికార్డుల్ని డిజిట‌లైజేష‌న్‌!
X
ఏపీలో మ‌రో కార్య‌క్ర‌మానికి తెర తీశారు. రాష్ట్రంలోని భూరికార్డుల‌న్నీ డిజిట‌లైజ్ చేసేలా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు షురూ చేసింది. ఇందులో భాగంగా ఈ వ్య‌వ‌హారాన్ని ఏపీ మంత్రి లోకేశ్ ఇప్పుడు టేక‌ప్ చేశారు. ఏపీలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఉన్న ద‌స్త్రాల‌న్నీ డిజిట‌లైజ్ చేస్తార‌ని చెప్పారు. ఇందుకోసం బ్లాక్ చైన్ టెక్నాల‌జీని వినియోగించ‌నున్నారు.

బ్లాక్ చైన్ టెక్నాల‌జీపై చ‌ర్చించేందుకు వీలుగా దానికి సంబంధించి ఫ‌స్ట్ అమెరికా సంస్థ ఇండియా విభాగంతో పాటు రెవెన్యూ అధికారులు.. మంత్రి లోకేశ్ హాజ‌ర‌య్యారు. ఈ మీటింగ్ లో భూరికార్డుల్ని డిజిట‌లీక‌ర‌ణ‌తో పాటు.. టెక్నాల‌జీని ఎలా వినియోగిస్తారో చెప్పారు.

త‌క్కువ స‌మ‌యంలో రికార్డుల్ని డిజిటిలైజ్ చేసిన ప‌క్షంలో బీమా.. రుణాలు పొందే వెసులుబాటు ల‌భిస్తుంన్నారు. దేశంలోనే తొలి డిజిటిలైజ్డ్ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుగా గ‌న్న‌వ‌రం కార్యాల‌యాన్ని రూపొందించిన‌ట్లు మంత్రి లోకేశ్ చెబుతున్నారు. తొలిద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్ని.. ఆ త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 290 కార్యాల‌యాల్లో ఈ టెక్నాల‌జీని అందుబాటులోకి తేనున్నారు. ఏపీలోని గ్రామీణ యువ‌త ఫైబ‌ర్ గ్రిడ్ ను వాడుకోవ‌టం ద్వారా ఇంటి నుంచి ప‌ని చేసుకునే ఒక న‌మూనాను అభివృద్ది చేయ‌నున్నట్లు చెబుతున్నారు.