Begin typing your search above and press return to search.
లోకేష్ పాదయాత్రకు సర్వంసిద్ధం.. ఫస్ట్ డే రూట్ మ్యాప్ ఇదే!
By: Tupaki Desk | 14 Jan 2023 12:12 AM ISTటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి `యువగళం` పేరుతో పాదయాత్రకురెడీ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఏపీ ప్రభుత్వం జీవో -1 విడుదల చేసిన నేపథ్యంలో ఈ పాదయాత్ర సాగుతుందా? లేదా? అనే సందేహాలునెలకొన్నాయి ఈ సందేహాలకు తెర దించుతూ.. టీడీపీ అధిస్టానం.. యువగళం పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ యువగళం పాదయాత్రను చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం, యువతకు ఉపాధి కల్పన, జాబ్ క్యాలండర్ వంటి కీలక అంశాలను ఎజెండాగా లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున.. 400 రోజులు.. 4,000 కిలోమీటర్లు యాత్ర చేయనున్నారు. అయితే కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగనున్న ఈ పాదయాత్ర రూట్ మ్యాప్ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ తాజాగా యువగళం మహా పాదయాత్ర రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు.
ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి 3 రోజులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవ ర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ యాత్ర విశేషాలను విడుదల చేశారు. మధ్యలో గంట సేపు..బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.