Begin typing your search above and press return to search.
వైరల్ వర్డ్ : మూర్ఖుడు
By: Tupaki Desk | 31 March 2022 9:00 AM ISTజగన్ ను అవమానించారు కనుకనే చంద్రబాబుకు విపక్ష స్థానానికి పరిమితం అయ్యారు అన్నది జనం మాట. ఇప్పుడు లోకేశ్ వంతు వచ్చింది. తాను ఎవ్వరినీ విడిచిపెట్టను అని మామ బాలయ్య బాబు రేంజ్లో డైలాగులు చెబుతున్నారు. అంటే రాజకీయం అంటే ఆధిపత్యం చూపించడమా లేదా అనవసర రాద్ధాంతాలకు ప్రాధాన్యం ఇవ్వడమా? ఏదమయినప్పటికీ భవిష్యత్ లో ఏం చేస్తామో చెప్పడం మరిచిపోయి జగన్ ను టార్గెట్ చేస్తూ నాలుగు డైలాగులు వేస్తే ఓట్లన్నవి రాలవు అని లోకేశ్ గుర్తు పెట్టుకుంటే చాలు అన్నది వైసీపీ చెబుతున్న హితవు.
నాలుగు దశాబ్దాల ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు చూసింది. సముద్రమంతటి జన వాహిని చెంత తనని తాను తెలుసుకుని ప్రయాణించింది. కొన్ని సార్లు తగ్గింది కొన్ని సార్లు తల పొగరు చూపించింది. కానీ ఏనాడూ భాష విషయమై కట్టు తప్పు మాట్లాడిన దాఖలాలు పెద్దగా లేవు. ఇప్పుడేమో కానీ రామారావు సమయంలో లేవు. ఇప్పుడేమో కానీ చంద్రబాబు కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కనుక చినబాబు ఆ పద్ధతిలో పోతున్నాడు. ఆ విధంగా ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కానీ ఆ విధంగా మాట్లాడితే ప్రత్యర్థులు ఏమయినా భయపడిపోతారా? లేదా ఆయన కనిపించగానే వంగొని ఎస్ బాస్ అంటారా? కొన్నిమాటలు ఈలలు గోలలు చేయించవచ్చు కానీ ఆ విధంగా మాట్లాడితే కాస్త చదువున్న వారు హర్షించరు. రాజకీయాలకు లక్ష్యం మంచి పాలన అందించడం అంతేకానీ కొట్లాడుకోవడానికి కాదు..కానీ మేం అలానే ఉంటాం.. అంటే ఇంకేం చెప్పేది? అయితే కొడాలి నానికి లోకేశ్ కు ఉన్న తేడా ఏంటట!
మాట ఏదయినా సరే రాజకీయాల్లో ఆచితూచి పలకాలి. పొలిటికల్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఫలితం అనవసర వాగ్వాదాలు రేగుతాయి. అశాంతి రేగుతుంది. అలజడులు కూడా రేగుతాయి. కనుక కొడాలి నాని మాట్లాడిన విధంగా నారా లోకేశ్ మాట్లాడకూడదు. ఎందుకంటే నారా లోకేశ్ కాస్త చదువుకున్నవాడు. కాస్తో కూస్తో వివేకం ఉన్నవాడు. ఓ రౌడీ స్టేజీ ఎక్కి వార్నింగ్ ఇచ్చిన విధంగా విపక్షాలను ఉద్దేశించి మాట్లాడకూడదు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ మనవుడు ఆయన. ఆ పాటి సంయమనం లేకుండా మాట్లాడితే ఎలా?
తెలుగుదేశం ఆవిర్భావ వేళ నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డిని బాగానే టార్గెట్ చేశారు. తాము అధికారంలో లేము కదా నానా మాటలు అంటున్నా పడబోమని, రేపటి వేళ పాలనా పగ్గాలు అందుకుంటే ఒక్కొక్కరినీ వదలబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ దేవుడు అని, చంద్రబాబు రాముడు అని కానీ నేను మూర్ఖుడ్ని అని అన్నారు. ఇవే మాటలు ఇప్పుడు పెను సంచలనం అవుతున్నాయి. అంటే కక్ష పూరిత రాజకీయాలు నడుపుతూ కాలం వెళ్లదీస్తారే తప్ప అభివృద్ధి అనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోరా అన్న ప్రశ్న ఒకటి వినిపిస్తోంది.