Begin typing your search above and press return to search.
లోకేష్ మాస్ పంచ్‌లు మామూలుగా లేవే...!
By: Tupaki Desk | 17 Feb 2022 10:00 PM ISTటీడీపీ యువనేత నారా లోకేష్ ప్రసంగాలు గమనిస్తే ఇటీవల బాగా రాటుదేలాడు. ఆయన మాస్ పంచ్‌లు అదిరిపోతున్నాయి. జనాల్లో కూడా లోకేష్ డైలాగులతో పాటు పదునైన ప్రసంగాలు, సెటైర్లకు మాస్ ఇమేజ్ బాగా పెరుగుతోంది.
తాజాగా పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఏపీలో పెట్టుబడుల కోసం దుబాయ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గౌతమ్‌రెడ్డి తన ప్రసంగంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎవరో మీకు పెద్దగా తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ సెటైర్లు వేస్తూ ట్వీట్లు వేశారు. ఇవి బాగా పేలుతున్నాయి.
జగన్ ఎవరో నిజంగానే మీకు తెలియకపోవచ్చు.. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యి కేవలం మూడేళ్లు మాత్రమే అవుతోంది... కానీ అద్భుతమైన లీడర్.. పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ రెడ్ కార్పెట్ వేస్తుందని గౌతంరెడ్డి దుబాయ్ వేదికపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై లోకేష్ ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేందుకే అబుదాబి వెళ్లారా ? అని సెటైర్ వేశారు.
ఇక జగన్ ఎవరో తెలియదని చెప్పడం మీ స్పీచ్‌కే హైలెట్ అన్న లోకేష్.. మీ బెదిరింపుల దెబ్బతో పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని.. దీంతో పాటు అక్కడ మీ ఘనతను కూడా ప్రచారం చేస్తున్నాయంటూ లోకేష్ ఎద్దేవా చేశాడు. జాతీయ వ్యాప్తంగానే కాకుండా.. అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఏపీ పరువు గంగలో కలిసి పోయిందని తీవ్రంగా విమర్శించారు.
కొత్త కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం మీకు చేతకాదు.. కనీసం ఉన్న పరిశ్రమలు అయినా ఇక్కడ నుంచి తరలివెళ్లిపోకుండా చూసుకోండని సూచనలు చేశారు. గత మూడేళ్లుగా ఏపీకి పారిశ్రామికవేత్తలు రాక.. పెట్టుబడులు లేక విలవిల్లాడుతోంది. ఇలాంటి టైంలో దుబాయ్ వేదికగా ఏపీ మంత్రి స్పీచ్‌ను సెటైరికల్‌గా లోకేష్ ఆడుకున్న తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.