Begin typing your search above and press return to search.

నాన్న వదిలినా.. నేను వదలను.. నారా లోకేష్ శపథం

By:  Tupaki Desk   |   22 Dec 2021 6:14 PM IST
నాన్న వదిలినా.. నేను వదలను.. నారా లోకేష్ శపథం
X
ఏపీలో అధికార వైసీపీ దాడులకు టీడీపీ ఖండిస్తోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తగ్గేదేలే అంటూ సవాల్ చేస్తున్నారు. వదలా... నేను వదలను అంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వస్తే మాత్రం వదిలిపెట్టనని శపథం చేస్తున్నారు. చంద్రబాబు కన్నీళ్లకు ప్రతీకారం తప్పదంటున్నారు.

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబును తిట్టిన పరిణామాల తీవ్రత తగ్గడం లేదు. ఆ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరిగిన దాడులు మరింత ఆజ్యంపోశాయి.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా లోకేష్ పలువురు నేతలు దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన మరోసారి లోకేష్ స్పందించారు.

మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తన తల్లిని కించపరిచిన వాళ్లను తన నాన్న చంద్రబాబు వదిలినా తాను వదలనంటూ శపథం చేశారు. ఎంతో నిబద్ధతతో నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్నా.. అవమానించడం ఏంటంటూ ప్రశ్నించారు.

తమ కుటుంబాన్ని ఏదో ఒక విషయంలో బయటకు లాగడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందంటూ విమర్శించారు. ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న వారంతా రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ హెచ్చరించారు.

నిన్నవరకు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయించిన ఈ ప్రభుత్వం.. నేడు సొంత పార్టీ వాళ్ల మీద దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ విమర్శించారు. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడులోని వెంకటనారాయణపై వైసీపీ కార్యకర్తల దాడులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని దూషిస్తోన్న వైసీపీ కార్యకర్తలను ప్రశ్నించడమే నేరమా అంటూ నిలదీశారు. తప్పుని తప్పని చెబితే చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు.