Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల హెడ్డాఫీస్‌ కు ముహుర్తం ఫిక్స్‌

By:  Tupaki Desk   |   7 Nov 2017 9:02 AM GMT
త‌మ్ముళ్ల హెడ్డాఫీస్‌ కు ముహుర్తం ఫిక్స్‌
X
ఆర్థికంగా అష్ట‌క‌ష్టాలు అనుభ‌విస్తున్న ఏపీ స‌ర్కారు.. హంగు.. ఆర్భాటాల విష‌యంలో మాత్రం అస్స‌లు త‌గ్గ‌ట్లేద‌ని చెప్పాలి. విభ‌జ‌న నేప‌థ్యంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. ప్ర‌జాధ‌నాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేయ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా. గ‌డిచిన మూడున్న‌రేళ్ల ప‌ద‌వీ కాలంలో ఆయ‌న పెట్టిన ఖ‌ర్చు లెక్క‌లు చూస్తే.. ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

తాత్కాలిక‌.. శాశ్విత పేరుతో పాటు.. మార్పులు చేర్పులంటూ కోట్లాది రూపాయిల్ని ఖ‌ర్చు చేశారు. అంతేనా.. శంకుస్థాప‌న‌ల మీద శంకుస్థాప‌న‌లు చేస్తూ.. ఈ వేడుక‌లకే భారీగా ఖ‌ర్చు అయిన ప‌రిస్థితి. అయితే.. ఇదంతా ప్ర‌భుత్వానికి సంబంధించిన ముచ్చ‌ట‌. ఇప్పుడు ఏపీ అధికార‌పార్టీకి చెందిన హెడ్డాఫీసును మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీలో టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని భారీగా నిర్మించాల‌ని భావిస్తున్నారు. ఇందుకోసం మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ చేశారు. భారీగా నిర్మించాల‌ని భావిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాల‌యానికి ఈ నెల 26న శంకుస్థాప‌న చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకుసంబంధించి మంత్రి నారా లోకేశ్‌.. ఎమ్మెల్సీ టీడీ జానార్ద‌న్‌.. మంత్రులు నారాయ‌ణ‌.. మాజీ మంత్రి ప‌ల్లెతో క‌లిసి బాబు త‌న నివాసంలో సుదీర్ఘంగా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

పార్టీ కార్యాల‌యానికి సంబంధించి చిన‌బాబు ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఆధునిక సాంకేతిక‌తో పార్టీ కార్యాల‌యానికి సంబంధించిన డిజైన్లు రూపొందించిన‌ట్లుగా తెలిసింది.

విశాల‌మైన ప్రాంగ‌ణం.. అంత‌ర్గ‌త స‌మావేశ మందిరం.. పార్టీ అధ్య‌క్షుడి కోసం ప్ర‌త్యేక గ‌దుల నిర్మాణంతో పాటు.. కార్య‌క‌ర్త‌ల కోసం రూపొందించిన విభాగాలు.. మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించి త‌యారు చేసిన న‌మూనాల్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా చిన‌బాబు ప‌లు సూచ‌న‌లు చేశారు. అయితే.. తాను చేసిన సూచ‌న‌ల‌కు తుది నిర్ణ‌యాన్ని బాబుకే అప్ప‌జెప్పేశారు. మూడు భ‌వ‌నాల స‌మాహారంగా పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని నిర్మిస్తార‌ని చెబుత‌న్నారు. అత్యాధునికంగా ఉండ‌టంతోపాటు.. ఆక‌ర్ష‌ణీయంగా ఉండేలా ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. మ‌రి.. పార్టీ కార్యాల‌యానికి ఎన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చుచేస్తారో చూడాలి.