Begin typing your search above and press return to search.

పార్టీ నేత‌ల‌కు లోకేష్..ఆయ‌న‌కు విద్యార్థి సంఘాల షాక్‌

By:  Tupaki Desk   |   10 July 2018 10:15 PM IST
పార్టీ నేత‌ల‌కు లోకేష్..ఆయ‌న‌కు విద్యార్థి సంఘాల షాక్‌
X
కర్నూలు జిల్లాలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ పర్యటన తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌ను తీవ్ర నిరాశ‌లో నింపింద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు సైతం చేదు అనుభ‌వాలు త‌ప్ప‌లేద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ముందుగా లోకేష్‌ కు ఎదురైన ప‌రాభావం గురించి చ‌ర్చిస్తే..స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి లోకేష్‌ కాన్వాయ్ ను విద్యార్ధి సంఘాల నేతలు అడ్డుకున్నారు. మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ లో బీసీ - ఎస్సీ - ఎస్టీలకు అన్యాం జరిగిందని..వారికి న్యాయం చేయాలని విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోనేందుకు ప్ర‌య‌త్నించ‌గా..విద్యార్ధులకు-పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. అనంత‌రం వారిని పోలీల‌సులు అరెస్ట్ చేశారు.

ఇక టీడీపీ నేత‌ల‌ను లోకేష్ ఏ విధంగా అప్‌సెట్ చేసిందంటే..జిల్లా పరిషత్‌ చేరుకుని అక్కడ నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్ అక్క‌డ ప‌ట్టుమ‌ని ప‌ది నిమిషాలు కూడా ఉండ‌లేదు. అదే స‌మ‌యంలో జ‌డ్జీ చైర్మ‌న్‌ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో రూ.3.67 కోట్ల వ్యయంతో నిర్మించిన జెడ్పీ నూతన పరిపాలన భవనాన్ని ప్రారంభించిన సంద‌ర్భంగా జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ భవనాన్ని పరిశీలించాలని కోరారు. అయితే దీనిపై మంత్రి లోకేష్‌ అసహనం వ్యక్తం చేశారు. మెట్లు ఎక్కేందుకు కూడా ఇష్టపడకుండానే వెనుదిరిగారు.‘ఇప్పటికే ఆలస్యమైంది. భవనం ప్రారంభించాం కదా? ఎన్నిసార్లు చెప్పాలి’ అంటూ జెడ్పీ చైర్మ‌న్‌ పై గుడ్లు ఉరిమారు. దీంతో అవాక్క‌వ‌డం జెడ్పీ చైర్మ‌న్ స‌హా అక్క‌డి టీడీపీ నేత‌ల వంతు అయింది. మూడు రోజులుగా జెడ్పీ చైర్మన్‌ తో పాటు అధికారులు - సిబ్బంది రాత్రీ పగలు కష్టపడి భవనాన్ని అందంగా తీర్చిదిద్దారని - అంతేకాకుండా మంత్రికి జెడ్పీటీసీ సభ్యులను పరిచయం చేయాలని - నాల్గో తరగతి ఉద్యోగులకు యూనిఫాం ఇప్పించాలని - నూతన భవనంలోని తన చాంబర్‌ లో మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించాలని చైర్మన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే...ఆయ‌న ఈ విధంగా హ‌డావుడిగా వెళ్లిపోవ‌డం పైగా - జెడ్పీ చైర్మ‌న్‌ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం త‌మ‌ను టీవ్రంగా అసంతృప్తికి గురి చేసింద‌ని అంటున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగు ప్రజలు బీజేపీకి అసలైన సినిమా చూపిస్తారని జోస్యం చెప్పారు.

కాగా, ఎప్ప‌ట్లాగే మంత్రి లోకేష్ ఈ కార్య‌క్ర‌మంలో కూడా విమ‌ర్శ‌లు - కార్య‌క్ర‌మాల‌కు ప‌రిమితం అయ్యారు. వివిధ చోట్ల మాట్లాడిన నారా లోకేష్‌.. కేంద్ర ప్రభుత్వంతో పాటు పవన్‌ - జగన్‌ లపైనా ఫైర్‌ అయ్యారు. జనసేన అధ్యక్షుడు తనపై అసత్య అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏవైనా ఆధారాలుంటే ప్రజలముందు ఉంచాలని సవాల్‌ విసిరారు. పవన్‌ - జగన్‌ ఇద్దరూ బీజేపీతో టచ్‌ లో ఉన్నారని లోకేష్‌ విమర్శించారు. ముగ్గురూ కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీని చూస్తే జగన్‌ - పవన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం మోడీని వారు ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు.



సోర్స్: సాక్షి