Begin typing your search above and press return to search.

నారా లోకేష్ ఓ వైరస్.. టీడీపీకి పట్టాడు: వర్మ

By:  Tupaki Desk   |   21 April 2021 3:51 AM GMT
నారా లోకేష్ ఓ వైరస్.. టీడీపీకి పట్టాడు: వర్మ
X
వివాదాలతో కాలం గడిపే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరోసారి సోషల్ మీడియా సాక్షిగా టీడీపీకి గురిపెట్టారు. ఈసారి నారా లోకేష్ ను వర్మ టార్గెట్ చేశారు. ఇటీవల టీడీపీలో అచ్చెన్నాయుడి పేరట వైరల్ అవుతున్న వీడియోలో ‘లోకేష్’పై కామెంట్స్ చూశాక వర్మ ఇలా స్పందించాడని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనే వైరస్ పట్టుకుందని వర్మ ఆరోపించారు. అది ప్రాణాంతక వ్యాధి అని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు ఆ వైరస్ నివారణగా పనిచేసే ఏకైక టీకా ఉందని.. దానిపేరే ‘తారక్9999’ అని జూనియర్ ఎన్టీఆర్ కు ట్యాగ్ చేస్తూ వర్మ సూచించాడు. టీడీపీ కార్యకర్తలంతా తన సలహా వినాలని వర్మ సూచించాడు. తెలుగుదేశం పార్టీకి తారక్ టీకా వేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. లేదంటే మీరందరూ ఆ వైరస్ బారిన పడి చచ్చిపోతారంటూ హెచ్చరించారు.

గతంలో కూడా టీడీపీని, చంద్రబాబును వర్మ వదల్లేదు. గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని ఏకంగా చంద్రబాబును టార్గెట్ చేసి విలన్ చేశారు. టీడీపీకి అసలు వారసుడు నారా లోకేష్ కాదని.. ఆ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ది అంటూ ట్వీట్ చేశాడు.

ఇప్పుడు కూడా వర్మ చేసిన ‘లోకేష్ వైరస్’ అనే ట్వీట్ సంచలనంగా మారింది. లోకేష్ ను వైరస్ తో పోల్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.