Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ ను విమ‌ర్శించి..బుక్క‌యిపోయిన లోకేష్‌

By:  Tupaki Desk   |   26 Oct 2018 7:56 PM IST
జ‌గ‌న్‌ ను విమ‌ర్శించి..బుక్క‌యిపోయిన లోకేష్‌
X
తన మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేయ‌డం కంటే..సొంత పార్టీనే న‌వ్వుల పాలు చేయ‌డంలో పాపుల‌ర్ అయిపోయిన ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ తాజాగా ట్వీట్ల విష‌యంలో కూడా అదే ఒర‌వ‌డిని పాటిస్తున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే త‌న వ‌ల్ల‌ త‌న తండ్రి శిరోభారాన్ని మోస్తుంటే...అదే విష‌యాల‌ను ప‌దేప‌దే గుర్తుకు తెచ్చేలా లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని అంటున్నారు. ఇదంతా...వైఎఎస్‌ జ‌గ‌న్ విష‌యంలో లోకేష్ చేసిన కామెంట్ల ఫ‌లిత‌మేన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయలో గురువారం శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి పందెంలో వాడే కత్తితో దాడి చేయడంతో జగన్ భుజంపై గాయమైన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన జ‌గ‌న్ మ‌రుస‌టి రోజు డిశ్చార్జ్ అయ్యారు. అయితే, దీనిపై తాజాగా నారా లోకేష్ ట్విట్ట‌ర్లో స్పందించారు. ``వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.`` అని పేర్కొన్నారు. మ‌రో ట్వీట్లో ``తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు.ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే`` అంటూ కామెంట్లు చేశారు.

అయితే, ఈ సెటైర్ల‌తో లోకేష్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నార‌ని ప‌లువురు అంటున్నారు. లోకేష్‌ ముందుగా ప్ర‌స్తావించిన ఓట‌మి భ‌యం గురించి తీసుకుంటే...ఓట‌మి భ‌యం వ‌ల్లే..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో కూడా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఓట‌మి భ‌య‌మే త‌ప్ప మ‌రేమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఓట‌మికి భ‌య‌ప‌డి ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం వ‌ల్ల ఆఖ‌రికి కోర్టుల‌చే మొట్టికాయ‌లు కూడా తిన్నార‌ని గుర్తుచేస్తున్నారు. ఇక అధికార పీఠం విషయంలో లోకేష్‌ను మించిన ఉదాహ‌ర‌ణ మ‌రేమి ఉంటుంద‌ని ప‌లువురు గుర్తుచేస్తున్నారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని వ్య‌క్తి ఎమ్మెల్సీగా అయి, అదే రీతిలో తండ్రి అధికారంతో మంత్రి అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌ని...అలాంటి వ్య‌క్తి త‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇస్తాన‌న్న పార్టీకి గుడ్‌బై చెప్పి..ఎంపీ ప‌ద‌విని వ‌దులుకొని ప్ర‌జాక్షేత్రంలో ఉన్న నాయ‌కుడిపై విమ‌ర్శ‌లు చేస్తున్న తీరు చిత్రంగా ఉంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.