Begin typing your search above and press return to search.
చిన బాబు వచ్చినాడు : చాలా కాలానికి మంగళగిరికి ! ఫుల్ జోష్ మీదున్నడే !
By: Tupaki Desk | 22 April 2022 5:00 AM ISTఅత్యంత బలమైన ప్రత్యర్థిని ఢీకొనడం అంత సులువు కాదు అని తేలిపోయింది. ప్రత్యుపకారం చేసినా కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మళ్లీ మళ్లీ టీడీపీ వైపు చూడాలంటే ఇంకాస్త నమ్మకం కలిగించాలి. లేదా భరోసా ఇప్పించాలి అధినాయకత్వం చేత! ఆ విధంగా అయినా టీడీపీకి పూర్వ వైభవం కాస్త దక్కి నిలబడుతుంది.
వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొదలుకుని చాలా ప్రాంతాలలో టీడీపీ చాలా పెద్ద మాటల యుద్ధమే చేయాల్సి ఉంది. అందుకు తగ్గ సాధన సంపత్తిని పోగేసుకోవాలిక ! అంటే ప్రత్యర్థి తో వీలున్నంత ఎక్కువగా మాట్లాడించగలగాలి. వారి తప్పులను వెలుగులోకి తీసుకువచ్చే వేళ అవి నిరాధారంగా ఉండకూడదు. అదేవిధంగా నాటకీయతకు ఆనవాలు అన్న విధంగా కూడా ఉండకూడదు. అందుకు తగ్గ గణాంకాలు కూడా నమ్మబలికే విధంగానే ఉండాలి.
అప్పుడు మాత్రమే టీడీపీని జనం నమ్ముతారు. అధికారంలో ఉన్నప్పుడు నేను తప్పులు చేశాను అని చంద్రబాబు మరో సారి ఒప్పుకునే తరుణం రానే వచ్చింది. వాటిని ప్రస్తావిస్తూనే జగన్ సర్కారు చేస్తున్న లేదా చేయబోతున్న తప్పిదాల సంఖ్యను వివరించగలగాలి. అప్పుడే విజయం టీడీపీకి. ఈ నేపథ్యాన చినబాబు అయిన లోకేశ్ ఇవాళ మంగళగిరికి చేరుకున్నారు. ఆయనేమన్నారంటే...
"మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించాను. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్యకర్త నవీన్ ని పరామర్శించాను. అనంతరం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో పర్యటించాను. విద్యుత్ కోతలతో పడుతున్న బాధలు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ వేధింపులు, అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్న ఎంపిటిసిలు, గ్రామ సర్పంచ్ ని కలిసి అండగా ఉంటానని హామీ ఇచ్చాను." ఇదీ చినబాబు అయిన లోకేశ్ సోషల్ మీడియాలో ఇచ్చిన స్టేట్మెంట్...
ఇక లోకేశ్ కూడా సొంత నియోజకవర్గం పై మొగ్గు చూపాలి. అదేవిధంగా ఉత్తరాంధ్రతో సహా ఇతర ప్రాంతాలపై ఫోకస్ పెంచాలి.నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న క్రియాశీలక కార్యకర్తలను ఏకం చేయాలి. ఇవే ఇప్పుడు లోకేశ్ ముందున్న లక్ష్యాలు కావాలి. అంతేకాకుండా క్యాడర్ ను నిలబెట్టే విధంగా లీడర్లు తయారు కావాలి. ఇదే నినాదంతో అటు చంద్రబాబు కానీ ఇటు లోకేశ్ కానీ పనిచేస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం.