Begin typing your search above and press return to search.

వైసీపీకి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్ బాబు

By:  Tupaki Desk   |   23 March 2022 6:00 PM IST
వైసీపీకి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్ బాబు
X
అసెంబ్లీలో, మండలిలో తననే తిడుతున్నారని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కల్తీసారా, జే బ్రాండ్ల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని అసెంబ్లీ నుంచి పాదయాత్ర చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. 'వైసీపీ వాళ్లకు నేనే త్రెట్ అని.. నన్ను చూసి భయపడుతున్నారని.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని తిుడుతున్నారని.. ప్రజల గురించి తిట్లు భరిస్తున్నామని' నారా లోకేష్ తెలిపారు.

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిట్టాడని.. ఆయన క్షమాపణలు కూడా చెప్పలేదని.. అలాంటి పదాలు వాడవచ్చా? అని లోకేష్ నిలదీశారు. నా తల్లిని దూషిస్తే.. ముఖ్యమంత్రి , స్పీకర్ నవ్వుతున్నారని.. నేను మర్చిపోలేదు అన్నీ గుర్తు పెట్టుకుంటానని నారా లోకేష్ సంచలన ప్రతిజ్ఞ చేశారు.

కల్తీసారా, జేబ్రాండ్ల మరణాలు సీఎం జగన్ పాపమేనంటూ అసెంబ్లీ ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. నాణ్యమైన బ్రాండ్లు అమ్ముతున్నామని చెబుతున్న ప్రభుత్వం. సభలో చర్చ అనగానే ఎందుకు పారిపోతోందని నిలదీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కౌన్సిల్ చరిత్రలోనే మొదటిసారి ఆరుగురు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. వాళ్ల దోపిడీ బయటకు వస్తుందనే భయంతోనే చర్చకు రావడం లేదన్నారు. తమను సస్పెండ్ చేసినా పోరాటం ఆగదని కుండబద్దలు కొట్టారు.

ఇక మూడు రాజధానుల బిల్లు సమయంలో మంత్రులు గొడవ చేశారని.. మండలి చైర్మన్ ను వ్యక్తిగతంగా దూషించారని టీడీపీ ఎమ్మెల్సీ రామారావు ఆరోపించారు. అప్పుడు లేని సస్పెన్షన్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో ఎందుని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు.