Begin typing your search above and press return to search.

చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు.. జగన్‌పై లోకేష్‌ ఘాటు వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   25 Oct 2022 4:35 PM IST
చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు.. జగన్‌పై లోకేష్‌ ఘాటు వ్యాఖ్యలు!
X
టీడీపీ పేరుతో కొన్ని ఫేస్‌బుక్‌ పేజీలు, ట్విట్టర్‌ హ్యాండిల్స్‌ చేస్తున్న చౌకబారు వ్యాఖ్యలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరోసారి తన ట్విట్టర్‌లో ఖండించారు. మెగాస్టార్‌ చిరంజీవి... ''వాల్తేరు వీరయ్య'', నందమూరి బాలకృష్ణ.... ''వీరసింహా రెడ్డి'' వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ పడనున్నాయి. ఈ రెండూ జనవరి 11న ఒకటి, జనవరి 12న మరొకటి విడుదల కానున్నాయని సమాచారం.

ఈ నేపథ్యంలో వైసీపీ పేటీఎం బ్యాచ్‌లు బాలకృష్ణతో పోలుస్తూ చిరంజీవిని కించపరుస్తున్నారని నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చిరంజీవి– బాలకృష్ణ మధ్య పోటీ, సంక్రాంతికి విడుదలయిన ఇద్దరు సినిమాలు, ఆ సినిమాల్లో చిరంజీవి నిమ్మ కులాల పాత్రలు పోషించారంటూ బాలయ్య yీ పీతో ఎవరో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపైన లోకేష్‌ మండిపడ్డారు. టీడీపీ పేరుతో ఫేక్‌ అకౌంట్లు, ఫేక్‌ పేస్‌బుక్‌ పేజీలు సృష్టించి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో పలు పోస్టులు చేశారు.

బాలయ్య తన సినిమాల్లో అగ్రవర్ణ వ్యక్తిగా నటించిన ప్రతిసారీ, చిరంజీవి నిమ్నజాతి వ్యక్తిగా (ఆ సినిమాల్లో ఆయన పోషించిన పాత్రల పరంగా) కనిపించారని కించపరిచినట్టు ఆ పోస్టు ఉంది. చిరంజీవి నిమ్మజాతి వ్యక్తిగా నటించిన ప్రతిసారీ బాలయ్యే సినిమాలే విజయం సాధించాయని ఫేక్‌ అకౌంట్‌ అని చెప్పబడుతున్న వ్యక్తి పోస్టులో ఉంది.

అలాగే రాబోయే వాల్తేరు వీరయ్యలోనూ చిరంజీవి మత్స్యకార వర్గానికి చెందిన (బీసీ) వ్యక్తిగా నటిస్తున్నాడని.. బాలకృష్ణ వీరనరసింహారెడ్డిగా వస్తున్నాడని కాబట్టి ఈ సినిమా కూడా హిట్టేనని అతడు పోస్టు చేశాడు.

దీనిపై నారా లోకేష్‌ మండిపడ్డారు. ''ప్యాలస్‌ పిల్లి చీప్‌ ట్రిక్స్‌..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్‌ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్‌ రంగంలోకి దిగాయి తస్మాత్‌ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఫేక్‌ అకౌంట్స్, ఫేక్‌ ట్వీట్స్‌ నీకు ఆత్మసంతప్తిని ఇస్తాయేమో కానీ నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్‌ రెడ్డి!'' అంటూ నారా లోకేష్‌ తన ట్వీట్స్‌లో ధ్వజమెత్తారు.