Begin typing your search above and press return to search.
నిన్నటి ఆత్మహత్య.. నేడు రేప్ గా మారిందా? జగన్ కు నారా లోకేష్ ప్రశ్న
By: Tupaki Desk | 9 May 2022 6:54 PM ISTసత్యసాయి జిల్లాకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని కేసులో "నిన్నటి ఆత్మహత్య నేటి రేప్"గా ఎలా మారిందో జగన్ రెడ్డి చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో వైసీపీ దండు పాళ్యం గ్యాంగ్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ.. నిలదీశారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించ డం వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్‌ను తప్పించే ఎత్తుగడేనని నారా లోకేశ్ ఆరోపించారు.
తమ కుమార్తెను హత్యాచారం చేశారని తల్లిదండ్రులు ఆరోపించినా... పోస్ట్‌మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ తేల్చేశారని ఆయన మండిపడ్డారు. నిన్నటి ఆత్మహత్య నేటి రేప్గా ఎలా మారిందో జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగింది?
తిరుపతిలో బీ.ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న యువతి తేజస్విని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రియుడుగా చెబుతున్న సాదిక్కు సంబంధించిన వ్యవసాయ షెడ్డులో ఉరి వేసుకొని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త వెలుగుచూసింది.
యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు ఏం చేశారంటే..
తేజస్విని మృతి కేసులో నిందితుడైన సాదిక్ను గోరంట్ల పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో తేజస్వినిని నమ్మించి.. శారీరకంగా అనుభవించి ఆమె మృతికి కారణమైన సాధిక్ను కొత్తచెరువు మండలం నారపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ సీజ్ చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం 376 సెక్షన్తో పాటు 420, 306 సెక్షన్లు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.
రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి... ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దిశా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దీనిపైనే నారా లోకేశ్ ఫైరయ్యారు. నిన్నేమో.. ఆత్మహత్యగా పేర్కొన్న కేసు.. ఈ రోజు రేప్ ఎలా అయిందని.. నిలదీశారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరో వైపు ఇంత జరిగినా.. హోం మంత్రి వనిత మాత్రం స్పందించకపోవడం గమనార్హం.