Begin typing your search above and press return to search.

జగన్ మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరు

By:  Tupaki Desk   |   16 Nov 2021 8:31 PM IST
జగన్ మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరు
X
ఏపీకి ఇప్పటివరకు శాశ్వత రాజధాని లేదు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అమరావతిలోనే  రాజధాని నిర్మించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన అనుకునట్లే రాజధానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేసించారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత  ఏపీకి మూడు రాజధానులను ప్రటించారు. విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా ప్రకటించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీతో పాటు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వివాదం ఇప్పుడు హైకోర్టులో ఉంది. రాజధానిపై వైసీపీ, టీడీపీ మధ్య ప్రతిరోజు ఏదో ఒక చోట మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అమరావతి రాజధానిగా ఉండాలని టీడీపీ... కాదు కాదు మూడు రాజధానులుంటాయని, మూడు రాజధానులు ఆవశ్యకతను మంత్రులు వివరిస్తూ వస్తున్నారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి వ్యతిరేకించారు. సీఎం జగన్ ఆయన మంత్రివర్గం మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌జా రాజ‌ధానిపై జ‌గ‌న్‌ విద్వేష‌పు కుట్ర‌ల‌పై అమ‌రావ‌తి రైతులు, కూలీల‌ పోరాటం ఏడు వందల రోజుల‌కు చేరిందని తెలిపారు. అమరావతి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు.  కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు అమరావతికి ఉందని గుర్తుచేశారు. ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. 30 వేల మంది రైతుల స‌మ‌స్య‌గా చిన్న‌చూపు చూసిన పాల‌కులకు.. క‌ళ్లు బైర్లు క‌మ్మేలా ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలిచారని తెలిపారు. అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన‌ 'న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం'పాద‌యాత్ర‌ జ‌న‌సంద్రాన్ని త‌ల‌పిస్తోందని లోకేష్ చెప్పారు. ఒకే రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-ఒకే రాజ‌ధాని అమ‌రావ‌తి మాత్ర‌మే ఉంటాయని తెలిపారు. 'జై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. జై అమ‌రావ‌తి' అంటూ లోకేష్ నినదించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి లోకేష్ డిమాండ్ చేశారు. రాజధానిపై జగన్ విద్వేష కుట్రలపై అమరావతి రైతులు, కూలీలు సాగిస్తున్న పోరాటాలు 700 రోజులకు చేరుకుందని నారా లోకేష్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 700 రోజులూ పూర్తయింది. రాజధానిగా అమరావతిని సాధించే ఉద్యమానికి టీడీపీ అండగా నిలిచింది. ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఆంధ్రుల రాజధానిగా కొనసాగుతుందని టీడీపీ స్పష్టం చేసింది. అమరావతి ఉద్యమానికి, 'న్యాయస్థానం టూ దేవస్థానం'చేస్తున్న మహాపాదయాత్రకు మద్దతు ఇవ్వాలని టీడీపీ కోరుకుంటోంది. పాదయాత్ర విరివిగా పాల్గొన్ని రైతుల ఉద్యమానికి బలాన్ని ఇవ్వాలని పిలుపునిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఠీవిగా నిలబడాలని, రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగాలని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

మురోవైపు రాజధాని అమరావతి కేసులపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి కీలక అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని అమరావతి కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారని, రైతులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు.  రాజకీయ విద్వేషంతో అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్ క్యాపిటల్‌గా మార్చేసిందని శ్యామ్ దివాన్ హైకోర్టులో వాదనలు వినిపించారు.