Begin typing your search above and press return to search.

లోకల్ ఎమ్మెల్యే మీద ఫైర్ అయిన లోకేష్

By:  Tupaki Desk   |   9 Dec 2021 10:00 PM IST
లోకల్ ఎమ్మెల్యే మీద ఫైర్ అయిన లోకేష్
X
మంగళగిరి.. ఈ నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ లోకల్.. చంటిగాడు అన్నమాట.. ఆయన పోయిన సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. గెలిస్తే ఎమ్మెల్యే అయ్యిండే వాడు.కానీ బ్యాడ్ లక్.. ఆయనను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓడించి సంచలనం సృష్టించారు.

అప్పటి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి నారా లోకేష్ కు పడడం లేదు. ఇద్దరూ ప్రత్యర్థులుగా ఒకరి లూప్ హోల్స్ మరొకరు బయటపెట్టి ఆడిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ఫైట్ యమ రంజుగా మారింది. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యేపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణ నియోజకవర్గానికి లెక్చరర్ గా మారారని కౌంటర్ వేశారు. వారానికి ఒకసారి గౌతమ్ బుద్ద రోడ్డు ముందు నాలుగు ఫొటోలు దిగి జంప్ అయిపోతారని ఎద్దేవా చేశారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న నియోజకవర్గంలో అభివృద్ధికి దిక్కులేదని లోకేష్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ఆళ్లను వదిలిపెట్టేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఇక నుంచి ఎక్కడికక్కడ నిలదీతలు కొనసాగుతాయన్నారు.

లోకల్ ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణను ఇక నియోజకవర్గంలో ఎండగట్టి వచ్చే ఎన్నికల వరకూ బలంగా తయారై ఎలాగైనా గెలుపు పల్లకీ ఎక్కాలని నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆ ప్రయత్నాలు నెరవేరుతాయా? లేదా ? అన్నది వేచిచూడాలి.