Begin typing your search above and press return to search.

పోటీకి లోకేష్ కే ధైర్యం చాలడం లేదా?

By:  Tupaki Desk   |   21 Feb 2019 4:40 AM GMT
పోటీకి లోకేష్ కే ధైర్యం చాలడం లేదా?
X
ఆపరేషన్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ అనేసిన టీడీపీ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో బందరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఈ సమయంలో లోకేశ్‌ పోటీపై కొంతలో కొంత క్లారిటీ వచ్చేసిందని టీడీపీ శ్రేణులు అంటున్నారట.

పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కే మళ్లీ టికెట్‌ ఇవ్వనున్నట్లు టీడీపీ అధినేత ఖరారు చేసినట్లు సమాచారం.. ఈ స్థానంలో లోకేశ్‌ పోటీ చేస్తే తాను తప్పుకుంటానని బోడె ప్రసాద్‌ తాజాగా ప్రకటించారు. లోకేశ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చలో పెనుమలూరు పేరు వినిపించింది. అయితే పెనుమలూరును బోడె ప్రసాద్‌ కే కేటాయించడంలో అక్కడి నుంచి లోకేశ్‌ పోటీ చేయడనే క్లారిటీ వచ్చిందని టీడీపీ నాయకులు అనుకుంటున్నారట.

ఇక గుడివాడ నియోజకవర్గం మీద టీడపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొడాలి నానిని ఖచ్చితంగా ఓడించాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఈక్రమంలో రావు వెంకటేశ్వర్‌ రావుకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చింది పార్టీ. కానీ కొడాలి నాని మీద దేవినేని అవినాష్‌ ని దింపాలన్న ఆలోచనలో పార్టీ ఉందట. దీంతో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్‌ అని పార్టీ వర్గాలో చర్చ ప్రారంభమైందట. కానీ ఇంత తక్కువ సమయంలో కొడాలి నానిని అవినాష్‌ సమర్థవంతంగా ఎదుర్కొగలడా..? అన్న చర్చ దేవినేని వర్గంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్‌ ఎంత మేరకు రాణించగలడని చంద్రబాబు సర్వే చేయిస్తున్నాడట.

గన్నవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టికెట్‌ కన్ఫామ్‌ చేశారు చంద్రబాబు. అలాగే మంత్రి కొల్లు రవీంద్రకు బందరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. అవనిగడ్డ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌ కు తిరిగి అవనిగడ్డ టికెట్‌ ను ఇవ్వనున్నారట. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారట. పెడరె టికెట్‌ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. కానీ ఆయనను మరోసారి ఎంపీగానే పంపించాలని అధిష్టానం చూస్తుందట. ఇలా లోకేష్ బాబు కోసం టికెట్ ఇవ్వడానికి అందరు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ అయినా పోటీచేయడానికి లోకేష్ కే ధైర్యం చాలడం లేదన్న గుసగుసలు టీడీపీలో వినిపిస్తున్నాయి.