Begin typing your search above and press return to search.
ఏయూ వీసీ రీకాల్ కి లోకేష్ డిమాండ్... ఎందుకంటే....?
By: Tupaki Desk | 6 March 2022 8:07 PM ISTవిశాఖలో దాదాపుగా వందేళ్ళ చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్శిటీ ఉంది. తొలి వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఏయూకు అడుగులు నేర్పితే ప్రపంచం గర్వించే విద్యావేత్త, మేధావి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ఏయూకి తరువాత వీసీగా సేవలు అందించారు. ఆ మీదట ఎంతో మంది ప్రముఖులు ఏయూలో పనిచేశారు. అలాంటి ఏయూని ఇపుడు టీడీపీ టార్గెట్ చేసింది.
గత కొంతకాలంగా ఏయూలో అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆరోపిస్తూ వస్తోంది. ఇపుడు దాన్ని కొనసాగిస్తూ ఏకంగా ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డిని రీకాల్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి తాజాగా ఒక లేఖ రాశారు.
ఏయూ అక్రమాల పుట్టగా మారిందని, అక్కడ వీసీ తన సొంత కులానికే ప్రాధాన్యత ఇస్తూ అన్ని నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారాని మండిపడ్డారు. ఏయూలో అంతా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని, నిబంధనలకు నీళ్ళొదిలేశారు అని కూడా నిప్పులు చెరిగారు.
ఇక ఏయూకి వచ్చే యూజీసీ నిధులను పక్క తోవ పట్టించారని, నియామకాలను కూడా తమ చిత్తం వచ్చినట్లుగా చేసుకుంటూ పోతున్నారని ఆయన విమర్శించారు. ఏయూ వీసీ ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారని, అందువల్ల ఆయన్ని తక్షణం రీకాల్ చేసి తీరాల్సిందే అని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఏయూని టీడీపీ గట్టిగానే గురి పెట్టి ఉంచింది.
ఇప్పటికే విశాఖలో చలో ఏయూ ఆందోళనను ప్రజా సంఘాలు నిర్వహించాయి. విపక్షాలు సైతం దానికి మద్దతు ఇచ్చాయి. ఇపుడు అది కాస్తా ముదిరి పాకాన పడేలా లోకేష్ కొత్త డిమాండ్ తెచ్చిపెట్టారు. మరి దీని మీద బిశ్వభూషణ్ హరిచందన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా ఏయూ వీసీ వర్సెస్ టీడీపీగా విశాఖలో వివాదం అయితే రాజుకుంది అని చెప్పాలి.