Begin typing your search above and press return to search.

ఇసుక కొరతపై లోకేష్ ఇలా నిరసన

By:  Tupaki Desk   |   30 Oct 2019 3:29 PM IST
ఇసుక కొరతపై లోకేష్ ఇలా నిరసన
X
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరత ఉండడం.. దాని పర్యవసనాలు చోటుచేసుకుంటుండడం తెలిసిందే.. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల వాగులు - వంకలు - నదులు ఉప్పొంగాయి. అన్నీ నీటితో కళకళలాడుతుండడంతో ఇసుకను తీయడం కష్టంగా మారింది. దీంతో ఏపీలో ఇసుక కొరత ఏర్పడింది.

ఇసుక కొరతపై ప్రతిపక్ష అధినేత చంద్రబాబు ఇప్పటికే వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఏపీలో ఇసుక కొరతపై పోరుబాట పట్టారు.

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ యువనేత నారా లోకేష్ ఏకంగా గుంటూరులో దీక్షకు దిగారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట లోకేష్ బాబు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తున్నారు.

లోకేష్ బాబే ఇసుక దీక్షకు దిగడంతో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తోపాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కదిలి వచ్చి మద్దతుగా దీక్షలో కూర్చున్నాయి