Begin typing your search above and press return to search.

ఇదేంది చినబాబు?..వర్మ సినిమాను నిజం చేస్తావా ఏంది?

By:  Tupaki Desk   |   9 Feb 2020 11:01 AM IST
ఇదేంది చినబాబు?..వర్మ సినిమాను నిజం చేస్తావా ఏంది?
X
రాజకీయ నాయకుడు అన్నాక.. ఎప్పుడేం మాట్లాడాలి? దేనికి ఎలా స్పందించాలన్న విషయం మీద స్పష్టత చాలా అవసరం. కేవలం తన నోటి మాటలతోనే ప్రభావితం చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. రాజకీయ నేతల్ని చూస్తే.. వారిలో ఏ టాలెంట్ ఉన్నా లేకున్నా.. ప్రజల మనసుల్ని దోచేసే శక్తి ఉంటుంది. చేతలతో పని చేయకుండానే.. మాటలతో కడుపు నింపేసే ధోరణి ఉంటుంది.

అందుకు భిన్నమైన నేతలు చాలా తక్కువగా ఉంటారు. అందునా ఏదైనా ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతల్లో ఇలాంటి టాలెంట్ తక్కువగా ఉన్నోళ్లు కనిపించరు. టీడీపీ అధినేత చంద్రబాబు బ్యాడ్ లక్ ఏమిటంటే.. ఎప్పుడేం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలన్న విషయంలో అదే పనిగా తప్పులు చేయటం. చినబాబుకు సంబంధించిన సోషల్ మీడియాలో కానీ.. యూట్యూబ్ లో మాటలు వింటే ఎంత కామెడీగా ఉండటమే కాదు.. ఆ పాత్ర పోలికతో ఇటీవల వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన చిత్రంలో తానెంత డ్యామేజ్ చేయాలో అంత చేసేశారు.

ఈ సినిమాలో లోకేశ్ ను పోలి ఉండే పాత్ర మాటలు.. చేష్టలు.. ఇంట్లో వ్యవహరించే విధానం లాంటివి కొన్ని చూపించారు. ఇందులో నిజమెంత అన్నది పక్కన పెడితే.. తన సినిమాతో వర్మ చినబాబును దారుణంగా ఏసుకున్నారని చెప్పాలి. ఈ సినిమాలో లోకేశ్ ను పోలిన పాత్రను గుర్తు తెచ్చేలా రియల్ లోకేశ్ తాజాగా మాట్లాడినట్లుగా చెబుతున్న ఫేస్ బుక్ పోస్టు ఒకటి వైరల్ అవుతోంది.

అందులో.. ఒక సభలో మాట్లాడుతూ..కార్పొరేటర్లుగా గెలవలేని వారిని ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ సొంతంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు లోకేశ్ మాట తీరును స్పష్టం చేయటంతో పాటు.. ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చసేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

నిజంగానే లోకేశ్ ఈ మాటలు అన్నారా? లేక.. మార్ఫింగ్ చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిజంగానే అని ఉంటే మాత్రం.. చినబాబు అండ్ కో అలెర్ట్ కావాల్సిన అవసరం ఉంది. లేదంటే..వర్మ వేసిన మరక అలా నిలబడిపోవటమే కాదు..తన సినిమాతో చూపించినదే నిజమన్నట్లుగా చేసినట్లు అవుతుందన్నది మర్చిపోకూడదు.