Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై చిన‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   7 Sept 2018 1:14 PM IST
కేసీఆర్ పై చిన‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు!
X
తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఏపీ ముఖ్య‌మంత్రి బాబు కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ మండిప‌డ్డారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయ‌న‌..తెలుగువారంతా క‌లిసి ఉండాల‌ని చెబుతూనే.. జాగో బాగో అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు.

టీఆర్ ఎస్ లో ఉన్న టీడీపీ వాళ్లు ఎంత మందో తెలుసుగా? అని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. టీఆర్ఎస్ లో ఉన్న టీడీపీ నేత‌లు ఎంత‌మంది ఉన్నారో అంద‌రికి తెలుస‌న్నారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకొని గెలిచిన త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ త‌న ప‌క్క‌న కూర్చొబెట్టుకున్నార‌న్నారు.

ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే గ్రేట‌ర్ పీఠాన్ని టీఆర్ ఎస్ చేజిక్కించుకుందా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. కేసీఆర్ వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్టారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ప‌లువురు ఎమ్మెల్యేలు టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యంసాధించ‌టం..అనంత‌రం టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన అనంత‌రం వారంతా గులాబీ కారు ఎక్క‌టం తెలిసిందే. ఇలా పార్టీలో చేరిన త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్ కు కేసీఆర్ మంత్రివ‌ర్గంలో తీసుకుంటూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా త‌మ అసెంబ్లీ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీపై గెలిచిన ప‌లువురు న‌గ‌ర ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇచ్చి ఖుషీ చేశారు. మాంచి జోష్ లో ఉన్న కేసీఆర్‌ ను ఉద్దేశించి చిన‌బాబు చేసిన కామెంట్స్‌ కు రియాక్ష‌న్ ఎంత తీవ్రంగా ఉంటుందో చూడాలి.