Begin typing your search above and press return to search.

ఢిల్లీలో చిన‌బాబు చెప్పిన లెక్క‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   12 Oct 2018 10:25 AM IST
ఢిల్లీలో చిన‌బాబు చెప్పిన లెక్క‌లు విన్నారా?
X
చేత‌ల‌తో చేయ‌కున్నా.. మాట‌ల‌తో త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శించే నేత‌లు బోలెడంత మంది క‌నిపిస్తారు. కానీ.. చేత‌ల్లోనే కాదు.. మాట‌ల్లోనూ ఒప్పించ‌లేని రాజ‌కీయ ప్ర‌ముఖుడు ఎవ‌రైనా ఉన్నారన్న ప్ర‌శ్న వేసినంత‌నే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సుపుత్రుడు.. ఏపీ మంత్రి లోకేశ్ పేరు చ‌ప్పున వ‌చ్చేస్తుంది. ఇంత‌కీ చిన‌బాబు ప్ర‌స్తావ‌న ఎందుకంటారా? తాజాగా ఆయ‌న ఢిల్లీకి వెళ్లారు. ప్ర‌పంచ ఆర్థిక వేదిక నిర్వ‌హించిన స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు.

ఈ సంద‌ర్భంగా మీడియాను క‌లిశారు. తండ్రి మాదిరే మైకులు.. ఛాన‌ల్స్ గొట్టాల్ని చూసినంత‌నే ప‌ర‌వ‌శించిపోయే బాబుకు త‌గ్గ‌ట్లే లోకేశ్ లోకూడా ఆ గుణం ఉందంటారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన లోకేశ్ ఆస‌క్తిక‌ర లెక్క‌లు చెప్పుకొచ్చారు. ఏపీలో వైఎస్ జ‌గ‌న్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లు చేతులు క‌లిపితే టీడీపీ ప్ర‌భంజ‌నం వీయ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను చెప్పారు దీనికి సంబంధించిన లెక్క‌నుచెప్పుకొచ్చారు.

జ‌గ‌న్‌.. ప‌వ‌న్ లు క‌లిస్తే తెలుగుదేశం నెత్తిన పాలు పోసిన‌ట్లేన‌ని చెప్పారు. అదే జ‌రిగితే 150సీట్లు టీడీపీకి ప‌క్కాగా వ‌స్తాయ‌ని చెప్పారు. జ‌గ‌న్‌.. ప‌వ‌న్ .. బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగితే టీడీపీ 174 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని.. ఒక్క పులివెందుల విష‌యంలోనే కాస్త డౌట్ అంటూ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ను ప్ర‌ద‌ర్శించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

రాజ‌కీయాల్లో అవ‌స‌రం కోసం క‌లిసే వారిని ప్ర‌జ‌లు ఆద‌రించ‌ర‌ని చెప్పిన లోకేశ్‌.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పారు.. మ్యాథ్స్ లో మాదిరి వ‌న్ ప్ల‌స్ వ‌న్ సూత్రం వ‌ర్క్ వుట్ కాద‌న్నారు. జ‌గ‌న్ మాట్లాడితే108 అంబులెన్స్ లు.. అవినీతి అంటార‌ని.. త‌న మీద చాలానే ఆరోప‌లు చేశార‌ని.. అయితే ఒక్క కాగితాన్ని కూడా చూపించ‌లేక‌పోతున్నార‌ని చెప్పారు. త‌న మీద చేసే ఆరోప‌ణ‌ల‌కు రుజువులు అడిగి.. అడిగి.. త‌న‌కు ఓపిక పోయింద‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి లోకేశ్ బాబు మాట‌ల్నే ప్రాతిప‌దికగా తీసుకుంటే.. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు 110 సీట్లు ప‌క్కానేనంటావా? తెలంగాణ‌లో అవ‌స‌రం కోస‌మే క‌దా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటోంది?