Begin typing your search above and press return to search.

ముందే కూసిన లోకేష్ కోయిలా...

By:  Tupaki Desk   |   9 July 2018 6:30 PM IST
ముందే కూసిన లోకేష్ కోయిలా...
X
ఇంటిలోను పోరు ఇంతింత కాదయ్య .... అన్నాడు ఒక మహాకవి..... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ము‌ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిస్థితి అటులనే ఉంది. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడి కొత్త సమస్య స్వాగతమివ్వనుంది. ఆయన కుమారుడైన నారా లోకేష్ కర్నూల్ ఎంపి - ఎంఎల్.ఎ అభ్యర్దులను ప్రకటించారు. అయితే ఆయన ఆ ప్రకటన ఏ హోదా తో చేసారన్నది తెలియాల్సుంది. ఎం.ఎల్.ఎ. -ఎం.పి అభ్యర్దులను ఆ పార్టీ రాష‌్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు కాని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాని ప్రకటించాలి.

ఆయన తమను కాదని వైెఎస్ ఆర్‌ సిపి నుంచి వచ్చిన బుట్ట రేణుకకు ఇవ్వడం పై తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సీనియర్లను కాదని వైెఎస్ ఆర్‌ సిపి ఓటు బ్యాంకుతో అభ్యర్దిని ప్రకటించడంపై ఆ జిల్లా సీనియర్లు మండిపడుతున్నారు. పార్టీలో అభ్యర్దుల గురించి ఇటువంటి చర్చ - ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉండగా లోకేష్ అత్యుత్సాహం పార్టీ నాయకులకు మింగుడుపడటంలేదు. విశాఖ జిల్లా భీమిలి ఎంఎల్ ఎ - మంత్రి అయిన గంటా శ్రీనివాస్ అక్కడ గెలుపు కష్టమని జరగుతున్నా ప్రచారంలో నారా లోకేష్ పాత్ర ఉందని గంటా అనుయాయులు మండిపడుతున్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కాదని లోకేష్ సొంత ప్రకటనల వలన పార్టీకి చాలా నష్టం అని సీనియర్లు నిందిస్తున్నారు.లోకేష్ అత్యుత్సాహం చూస్తుంటే తన తండ్రి చంద్రబాబు సీటుకే ఎసరు వచ్చేట్టుంది. ఈ సమస్యను చంద్రబాబు నాయుడు ఎలా నెట్టుకొస్తారో వేచి చూద్దాం.