Begin typing your search above and press return to search.

రాహుల్ జస్ట్ 134 రోజుల్లోనే.....లోకేష్ కి 400 రోజులా...?

By:  Tupaki Desk   |   31 Jan 2023 5:00 AM GMT
రాహుల్ జస్ట్ 134 రోజుల్లోనే.....లోకేష్ కి 400 రోజులా...?
X
దేశంలో ఇపుడు ఎక్కడ చూసినా పాదయాత్రల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరికి వారు కాళ్ళకు పని చెబుతున్నారు. వాకింగ్ తో ఆరోగ్యం కలసి వస్తుంది. లక్ ఉంటే కుర్చీ కూడా తమ దగ్గరకు వస్తుంది అలా స్వామి కార్యం స్వకార్యం అనుకుంటూ పాదయాత్రలు చేస్తున్నారు. అయితే ఈ పాదయాత్రలతో రికార్డులను కూడా బద్ధలు కొడుతున్న వారు ఉన్నారు.

రాహుల్ గాంధీ లాంటి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు పాదయాత్ర చేస్తారు అని ఎవరూ అనుకోలేదు. కానీ రాహుల్ గాంధీ కూడా యువరాజుని కాదు సాధారణ నాయకుడినే అంటూ కన్యాకుమారీ టూ కాశ్మీర్ దాకా అలా అలోవోకగా నడిచేశారు. రాహుల్ గాంధీ 2022 సెప్టెంబర్ లో పాదయాత్ర స్టార్ట్ చేసి జనవరి 29న ముగించారు.

రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్ల దూరం సాగారు. పది రాష్ట్రాలను చుట్టుముట్టారు. మధ్యలో రెస్ట్ తీసుకున్న రోజులు అన్నీ తీసేస్తే నిఖార్సుగా రాహుల్ నడిచింది 134 రోజులే అని లెక్క వేశారు. మరి 134 రోజులలో నాలుగు వేల కిలోమీటర్లు అంటే సగటున రోజుకు 30 కిలోమీటర్లు దాకా రాహుల్ నడిచారు అన్న మాట. ఇది నిజంగా రికార్డే అంటున్నారు. ఎందుకంటే రోజుకు ఎంత జోరుగా నడిచేవారు అయినా పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు దూరం మాత్రమే నడవగలరు.

కానీ రాహుల్ ఏకధాటిగా ఈ పాదయాత్ర పూర్తి చేశారు అని అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ పాదయాత్రలో జనాలు లేరా అంటే బాగానే ఉన్నారు. ఆయన కూడా వారితో కలుస్తూ ముందుకు సాగారు. వారితో మాట్లాడారు, వారి కష్టాలు తెలుసుకున్నారు. వారితోనే ఎండలూ వానలూ అన్నట్లుగా సాగారు. ఇక బహిరంగ సభలు కూడా చాలానే పెట్టారు.

తన పాదయాత్ర ఇంపాక్ట్ బాగా ఉండేలా చూసుకున్నారు. మరి రాహుల్ పాదయాత్ర దేశంలో కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఏపీలో జగన్ పద్నాలుగు నెలల కాలంలో 3,700 పై చిలుకు కిలోమీటర్లు నడిస్తే రాహుల్ ఆ రికార్డుని తక్కువ టైం లోనే బద్ధలు కొట్టేశారు. ఇపుడు ఏపీలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు గా టార్గెట్ పెట్టుకున్నారు. అంటే రోజుకు పది కిలోమీటర్ల వంతున లోకేష్ నడుస్తారు అన్న మాట.

లోకేష్ ఈ నెల 27న కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆయన తొలి రోజు ఎనిమిది కిలోమీటర్ల వరకే నడిచారు. ఇలా లోకేష్ నడిస్తే నాలుగు వందల రోజులు పై దాటేలా ఉంటుందని కూడా లెక్క వేస్తున్నారు. ఇక రాహుల్ గాందీ కంటే లోకేష్ పన్నెండేళ్ళు చిన్నవాడు. రాహుల్ గాంధీ యాభై ఏళ్ళు పైబడిన ఏజ్ లోనే ఇంత హుషారుగా పాదయాత్ర చేస్తే లోకేష్ పాదయాత్ర దాని టార్గెట్లు చూస్తే నత్త నడకగానే అనిపిస్తోంది.

పైగా ఇన్ని రోజులు పాదయాత్ర పేరిట జనంలో ఉండడం మంచిదే కానీ దీని వల్ల కీలకమైన ఇతర బాధ్యతలు మంగళగిరి నియోజకవర్గంలో తన అభ్యర్ధిత్వం మీద ప్రచారం పార్టీ దశ దిశ డైరెక్షన్ ఇవన్నీ కూడా మిస్ అవుతారు అని అంటున్నారు పైగా ఇన్ని రోజుల పాదయాత్ర అంటే భారీ బడ్జెట్ సినిమాగా కూడా ఉంటుంది అని అంటున్నారు.

మరి యువకుడు నాలుగు పదుల వయసులో ఉన్న లోకేష్ రోజుకు కనీసం ఇరవై కిలోమీటర్ల మేర నడచినా రెండు వదన రోజులు ఆరేడు నెలల వ్యవధిలో ఏపీ అంతా పాదయాత్ర ముగుస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే రాహుల్ సడెన్ గా పాదయాత్ర చేసి అతి తక్కువ సమయంలో టార్గెట్ ని పూర్తి చేసి తనదైన బెంచ్ మార్క్ ని క్రియేట్ చేశారు అని అంటున్నారు. ఇప్పట్లో ఆ రికార్డుని కొట్టేవారు అయితే ఉండకపోవచ్చు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.