Begin typing your search above and press return to search.

మనవడి పుట్టిన రోజు...చంద్రబాబు ఫుల్ ఖుషీ

By:  Tupaki Desk   |   21 March 2016 12:13 PM IST
మనవడి పుట్టిన రోజు...చంద్రబాబు ఫుల్ ఖుషీ
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముద్దుల మనవడు... టీడీపీ యువరాజు లోకేశ్ కుమారుడు అయిన దేవాన్ష్ మొదటి పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు సంతోషంగా ఉన్నారు. మనవడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తిరుమల దేవస్థానంలో అన్నప్రసాద ట్రస్టుకు రూ. 20 లక్షలు విరాళం ఇచ్చారు. సోమవారం ఉదయమే దేవాన్షును నారా - నందమూరి కుటుంబసభ్యులు ఆశీర్వదించారు. సాయంత్రం హైదరాబాద్‌ లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ లో దేవాన్షు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించనున్నారు. కాగా చంద్రబాబు మనవడి పుట్టిన రోజు సందర్భంగా నందమూరి - నారా కుటుంబాల అభిమానులు - టీడీపీ కార్యకర్తలు ఫేస్ బుక్ లో ఒక ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. తల్లిదండ్రులు లోకేశ్ - బ్రహ్మణి... తాతయ్య - నాయనమ్మలు చంద్రబాబు - భువనేశ్వరిలతో దేవాన్షు సెల్ఫీ దిగినట్లుగా ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో మనవడి పుట్టిన రోజు వేడుకలను చంద్రబాబు ఘనంగా నిర్వహించబోతున్నారు. కుటుంబసభ్యులు - కొద్దిమంది ఆత్మీయులు దీనికి హాజరవుతారని తెలుస్తోంది.